బాబుపై పవన్ సంచలన కామెంట్స్..

praveen
జనసేన, టీడీపీ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి రెండు పార్టీలు కూడా విడిపోతాయంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. కానీ అలా జరిగే అవకాశం ఉండదని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్థం అవుతుంది. ఈ రెండు పార్టీల మధ్య కొన్ని అంశాలలో అభిప్రాయాలు వేరై ఉండి ఉండొచ్చు కానీ అవి ఇరుపార్టీల చీలికకు దారి తీసే అవకాశం లేదు. వారి మధ్య ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఈ తీరులో వ్యవహార నడుస్తుంటుంది అంతేతప్ప వారి మధ్య పెద్దగా గొడవలు లేవు. ఈ విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. తాను చంద్రబాబుతో సహా మిగతా అందరి టీడీపీ నేతలను గౌరవిస్తానని అన్నారు. తను పూర్తిగా చంద్రబాబును నమ్ముతానని ఆయన విషయాన్ని దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అంతేకాదు బీజేపీ నాయకులతో కూడా కలిసి తాము ముందుకు వెళ్తేనే సమిష్టి అభివృద్ధిని సాధించగలమని అన్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలు, అభిమానులకు అందరికీ సూచించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ.. "చంద్రబాబుకి నేను చాలా గౌరవిస్తాను. ఆయన కూడా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు ముందెళ్లండి సార్, మీ వెనుక వస్తాను అంటే ఆయన అలా కాదు నాతో పాటే రావాలి అంటూ నాకు చెప్తారు. అంత పెద్ద సీనియర్ నేత అయ్యుండి కూడా నాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. 'నాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్' అని నేను చెప్తున్నా కానీ చంద్రబాబు మాత్రం 'మీకు నేను రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే' అని అంటారు. అందుకే మేం చాలా చక్కగా కలిసి పనిచేయగలుగుతున్నాం. ఇలా చేయాలి అలా చేయాలి అని మేము అనుకుంటాం కానీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి మా మాటే నెగ్గాలి అని కాకుండా ఒక బాధ్యతతో ఒక మంచి నిర్ణయం తీసుకునే ముందుకు సాగుతున్నాం." అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: