అజ్ఞాతంలోకి పేర్ని నాని ఫ్యామిలీ..ఏ క్షణమైనా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నేతలు బయట తిరిగే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. ఇక్కడ చూసిన అరెస్టులు... కేసులు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న.. వైసిపి నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు తెలుగుదేశం కూటమి సభ్యులు. చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు.. ఏ ఒక్క వైసీపీ నాయకున్ని వదలడం లేదు కూటమి సర్కార్.
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత... వైసీపీలో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పైన రకరకాల కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ నేతలంతా... రాజకీయాల్లో యాక్టివ్గా లేకుండా కాస్త సైలెంట్ అయిపోయారు.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని కుటుంబం పైన పడిపోయారు తెలుగు తమ్ముళ్లు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై తాజాగా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. పేర్ని నాని భార్య జయసుధ పైన... సివిల్ సప్లై అధికారులు కేసు పెట్టారు. సివిల్ సప్లై విభాగంలో బియ్యం అమ్ముకున్నారని.. పేర్ని నాని సతీమణి జయసుధ పైన కేసు నమోదు చేశారు ఏపీ అధికారులు.
ఇందులో పేర్ని నాని పీఏ పైన కూడా... కేసు నమోదు.. కావడం జరిగింది. అయితే ఈ కేసు నమోదు అయిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని సతీమణి జయసుధ. అంతేకాదు ఏ క్షణమైనా అరెస్టు చేసే ప్రమాదం ఉందని అజ్ఞాతంలోకి వెళ్లిందట మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం. గత మూడు రోజులుగా పేర్ని నాని కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయంట. పేర్ని నాని ఫ్యామిలీ బెంగళూరు వెళ్ళినట్లు చెబుతున్నారు.