'నిర్భయ' ఆరో నిందితుడు.. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?
ఈ కేసులో ఒకడు జైలులోనే ఆత్మహత్య చేసుకోని చనిపోగా, మరో నలుగురికి ఉరి అమలు చేసింది ప్రభుత్వం. అయితే మిగిలిన మైనర్ నిందుతుడు మూడేళ్లపాటు బాలల కారాగారంలోనే ఉన్నాడు. తరువాత ఓ స్వశ్చంద సంస్థ ఆ కుర్రాడిని దక్షిణాది రాష్ట్రాలకు తరలించిదని సమాచారం. అవును, సుప్రీంకోర్టు తీర్పు గురించి తెలిసే అవకాశం లేని చోట అతను ఉన్నట్టు చెబుతున్నారు. ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామానికి చెందిన అతడు, చిన్నప్పుడే ఇంటిని వదిలి ఢిల్లీకి పారిపోయి వచ్చేసాడు. అనంతరం నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన బస్సులో క్లీనర్ గా చేరాడు. నిర్భయపై జరిగిన అత్యాచారం కేసులో అతడిని దోషిగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది.
శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడి బాగోగులు చూస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ దక్షిణాదిలో ఓ దాబాలో వంటవాడిగా కుదిర్చినట్టు సమాచారం. తనకు ఉరిశిక్ష పడుతుందని అతడు రోజూ భయంతో బతికేవాడని, అందుకే అతడిని దూరంగా పంపించామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ఇటీవల తెలపడం జరిగింది. అయితే అతడు ఎవరన్న విషయం అతడి యజమానికి కూడా తెలియదని, గతాన్ని మరచి చక్కగా పని చేసుకుంటున్నాడని వివరించారు. కాగా ఇపుడు అతడు ఎక్కడున్నాడన్న విషయం రహస్యంగా ఉన్నప్పటికీ, ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం అతడిపై ఓ కన్నేసి ఉంచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.