లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు..BJPకి ఎంత బలం అవసరం ?

Veldandi Saikiran
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే.. పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లును తీసుకువచ్చింది మోడీ సర్కార్‌. ఇందులో భాగంగానే... పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌ సభలో ప్రవేశపెట్టింది బీజేపీ. ఈ మేరకు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తన చేతుల మీదుగా జమిలి ఎన్నికల బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు లోక్‌ సభ స్పీకర్ కూడా అధికారిక ప్రకటన చేశారు.

అనంతరం జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ ప్రారంభం అయింది.  ఇక జమిలి ఎన్నికల బిల్లును పాస్‌ చేయించుకునేందుకు 129 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్‌.  జమిలి ఎన్నికల బిల్లును ఆమోదానికి 361 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  కానీ ప్రస్తుతం ఎన్డీయేకు 293మంది ఎంపీల మద్దతు ఉన్న సంగతి తెలిసిందే.
అదే సమయంలోనే.. ప్రతి పక్ష కూటమి కూడా బలంగానే ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉంది ప్రతి పక్షం.  దీంతో జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోన్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఒకే దేశం, ఒకే ఎన్నిక” (జమిలి ఎన్నికల) బిల్లులకు టిడిపి మద్దతు ఇస్తుందని  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటన చేశారు.
అసంబద్ధమైన ఈ బిల్లులను సభలో ఎలా అముమతించాలని డి.ఎమ్.కే ఎంపీ టిఆర్ బాలు ప్రశ్నించారు.  జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ... జమిలి ఎన్నికల బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎస్పీ ఎంపి ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ... జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చారన్నారు.  అటు కాంగ్రెస్ పార్టీతో పాటు, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే.. బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పార్లమెంట్‌ వేడి వాడిగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: