రేవంత్ సర్కార్ కు ఊహించని షాకిచ్చిన కవిత..
ఎంతో గొప్పగా ఉన్న తమ తెలంగాణ తల్లిని కాదని కాంగ్రెస్ మాతను తీసుకు రావడం తాము అసలు అంగీకరించమని కవిత వ్యాఖ్యానించారు. అలానే, తెలంగాణ మాత సాధారణ మహిళగా ఉంటూ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తుందని అంటున్నారని కానీ దానికి, కాంగ్రెస్ కి చాలా లింక్ ఉందని ఈమె చెబుతున్నారు. కొత్త తెలంగాణ తల్లిలో కల లేదని, అభయ హస్తం గుర్తుకు అది ప్రతిరూపంగా ఉందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తాము తెలంగాణ తల్లిని ఎలాంటి పార్టీ గుర్తులను ప్రతిబింబంచకుండా చాలా ప్రత్యేకంగా, పవిత్రంగా తీర్చిదిద్దామని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే కొత్త తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ రాష్ట్రంలో పెట్టిన అన్ని విగ్రహాలను తొలగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. తొలగించండి చూద్దామంటూ బీఆర్‌ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కవిత 22 అడుగుల విగ్రహం వద్దకు వెళ్లి గడ్డపారతో పొడిచి శంకుస్థాపన చేసి మరింత చర్చలకు దారి తీసారు. కవిత దూసుకు వెళ్తుండగా ఆమెను రేవంత్ సర్కార్ కట్టడి చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి చాలా కక్ష దారి అని, ఒకసారి ఆయన పగబడితే ఏదో ఒక రూపంలో ప్రతీకారం తీర్చుకుంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కవిత ఏమాత్రం వెనకడుగు వేసే అవకాశం లేదని మరి కొందరు మాట్లాడుకుంటున్నారు. మరి వీరిద్దరి మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలిగా.