జ‌గ‌న్ అయినా.. బాబు అయినా బాయి బాయినే..?

RAMAKRISHNA S.S.
తాజాగా టీడీపీ నాయ‌కుల‌కు, కేడ‌ర్‌కు పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పంపిన సంకేతాలు ఏంటి ? ఏపీకి అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో మొత్తం ప్రాజెక్టును రివ‌ర్స్ చేశార‌ని అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు తెగ గ‌గ్గోలు పెట్టిన విష‌యం తెలిసిందే. కానీ ఇప్పుడు మేఘా ఇంజ‌నీరింగ్ కంపెనీకు పోల‌వ‌రం ప‌నులు అప్ప‌గించినా.. మేం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోము.. రివ‌ర్స్ టెండ‌రింగ్ త‌ర్వాత కూడా మేఘాకే అద‌న‌పు ప‌నులు అప్ప‌గించినా మాకు ఓకే.. ఎలాంటి ఇబ్బంది లేదు అన్న సంకేతాలు చంద్ర‌బాబు పంపిన‌ట్టుగా ఉంద‌న్న చ‌ర్చ‌లు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ కొత్త చ‌ర్చ‌కు కార‌ణం ఏంటంటే శ‌నివారంమేఘా ఇంజ‌నీరింగ్ అధినేత మేఘా కృష్ణారెడ్డి స్వ‌గ్రామం డోకిప‌ర్రులో ఆయ‌న క‌ట్టించిన వెంక‌టేశ్వ‌ర‌స్వామి గుడిని చంద్ర‌బాబు ద‌ర్శించుకున్నారు. గుడికి వెళ్లి దైవ ద‌ర్శ‌నం చేసుకోవ‌డాన్ని ఎవ్వ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. కానీ ఎవ‌రితో వెళ్లాం.. వారు ఎవ‌రు ?  వారితో వెళితే పార్టీ కేడ‌ర్‌కు మ‌నం ఎలాంటి సంకేతాలు పంపిన‌ట్టు అవుతుంద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు పూర్తిగా మ‌ర్చిపోయిన‌ట్టున్నారు.

ఒక్క విష‌యం మాత్రం నిజం.. ఒక‌ప్పుడు చంద్ర‌బాబు కాంట్ర‌వ‌ర్సీ వ్య‌క్తుల‌కు బాగా దూరంగా ఉండేవారు. మొన్న‌టికి మొన్న కాంట్ర‌వ‌ర్సీల్లో ఉన్న సానా స‌తీష్‌కు ఏకంగా రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. జ‌గ‌న్ టైంలో మేఘా ఇంజ‌నీరింగ్ కంపెనీకి పోల‌వ‌రం ప్రాజెక్టుతో పాటు కోట్లాది రూపాయ‌ల పంప్డ్ స్టోరేజ్ ప‌నులు సైతం క‌ట్ట‌బెట్టారు. అధిక రేట్ల‌కు ఈ ప్రాజెక్టులు క‌ట్ట‌బెట్ట‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జ‌నాపై వంద‌ల కోట్ల భారం ప‌డుతుంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీడీపీ వాళ్లే దీనిపై ఎన్నో విమ‌ర్శ‌లు చేశారు.

అలాగే మెడిక‌ల్ కాలేజ్‌ల నిర్మాణాల కాంట్రాక్టులు కూడా మేఘాకే ద‌క్కాయి. ఇక మేఘాపై జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ప‌ట్టిసీమ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక అదే కంపెనీకి ఏకంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు అప్ప‌గించారు. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా మేఘా ..మేమూ ఒకటే... ఈ విష‌యంలో జ‌గ‌న్ అయినా.. తాను అయినా ఒక్క‌టే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: