వైసీపీలోకి ఏపీ టాప్ లీడ‌ర్‌.. చేరిన వెంట‌నే ఎమ్మెల్యే టిక్కెట్ కూడా..?

RAMAKRISHNA S.S.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం పొందింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మాజీ మంత్రులు .. ఎమ్మెల్యేలు .. ఎంపీలు చివరకు రాజ్యసభ సభ్యులు కూడా వరుస పెట్టి పార్టీని వీడుతుంటే పార్టీ కీలక నేతలలో ఎవ్వరు యాక్టివ్ గా లేని టైంలో ఒక టాప్ లీడర్ ఇప్పుడు వైసీపీలో చేరినందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ఆ నేత‌ ఎవరో ? కాదు మాజీ మంత్రి .. కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అని తెలుస్తోంది. జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ఆయన వైసీపీ లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల మాజీ ఎమ్మెల్యే భర్తను కలిసిన కార్యకర్తలకు మీకు కొత్త ఇన్చార్జిగా మాజీ మంత్రి వస్తున్నారు ఇకమీదట నా దగ్గరకు రావలసిన అవసరం లేదు అని ఆయన వైసీపీలో చేరాంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

శైలజనాథ్‌ సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా కీలకపాత్ర పోషించారు. ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల నాయకత్వం పెద్దగా ఉపయోగం లేదు. ఆమె ఆ పదవిలో కొనసాగితే కాంగ్రెస్ మరింత బలహీనమవుతుందని భావించిన ఆయన వైసీపీలో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు మెరుగుపరుచుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శైలజనాథ్ గతంలో టిడిపిలో చేరతారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో టిడిపి బీఫామ్ ఇచ్చిన జిల్లా పార్టీ పెద్దల వివాదాల కారణంగా చివరి నిమిషంలో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రిగా పనిచేయడంతో నియోజకవర్గంలోనూ ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ప్రస్తుతం సింగనమల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి .. ఆమె భర్త రాజకీయాల కంటే వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో శైలజానాథ్ పార్టీలో చేరితే వెంటనే సింగనమల నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి పగ్గాలు అప్పగించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన అనుభవాన్ని వాడుకోవాలని వైసిపి అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపటి వేళ‌ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక సమీకరణలు .. సీనియారిటీ కోటలో ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చి అవకాశం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: