ఏపీలో చక్రం తిప్పుతున్న కాపులు...3 పార్టీల్లో వాళ్లదే హవా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం... రాజకీయాలు మొత్తం కాపుల చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు పార్టీల్లో.. కాపు నేతలే బలంగా ఉన్నారు. అందుకే అన్ని పార్టీలు కూడా కాపు సామాజిక వర్గానికి.. పెద్దపీట వేయడం జరుగుతుంది. మొదటగా వైసిపి పార్టీని చూసినట్లయితే... ఆ పార్టీ రెడ్డి నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా... కాపులనే బాగా లేపుతోంది. పేర్ని నాని అలాగే అంబటి రాంబాబు లాంటి నేతలకు... వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు.

బీసీ అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బొత్స సత్యనారాయణకు కూడా... జగన్ ప్రాధాన్యత ఇవ్వడం చూసాం. మొన్నటి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ ముగ్గురు నాయకులే వైసిపి గలాన్ని ఇప్పుడు... ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నారు. జగన్ తరఫున పోరాటం చేస్తున్నారు.
 

అటు పవన్ కళ్యాణ్ ఎలాగో కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి...  అతని చూసి కాపు ఓటర్లు జనసేన వైపు కూడా వెళ్లారు. వైసీపీలో ఉన్న కాపు నేతలపై కూడా ఆయన టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.  వచ్చే ఎన్నికల్లోపు చాలామంది కాపు నేతలందరూ జనసేనలో... చేరే అవకాశాలు ఉన్నాయి.  అయితే ఒకవేళ వైసీపీ నుంచి కాపు నేతలు జారుకుంటే... ఇతర సామాజిక వర్గాలను... జగన్మోహన్ రెడ్డి హక్కున చేర్చుకునే అవకాశాలు ఉంటాయి.

లేదు ఆ కాపు నేతలు అందరూ వైసీపీలోనే ఉంటే వారితో జగన్ ప్రయాణం ఉంటుంది. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది. కూటమిలో జనసేన ఉన్న నేపథ్యంలో.. కాపు నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు చంద్రబాబు నాయుడు. ఒకవేళ కాపు నేతలను టిడిపిలో చేర్చుకుంటే... పవన్ ఎదురు తిరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కాపు నేతలపై టిడిపి ఫోకస్ పెట్టే అవకాశాలు లేవు. వచ్చే ఎన్నికల్లోపు పరిస్థితులను బట్టి టిడిపి... అడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు మూడు కీలక పార్టీలో కాపు నేతలే... చక్రం తిప్పుతున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: