బరితెగించిన జనసేన...అశ్లీల నృత్యాలతో రచ్చ రంబోలా ?

Veldandi Saikiran
జనసేన పార్టీ రోజుకో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఏపీలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో సతమతమౌవుతున్న జనసేన పార్టీ ఇప్పుడు.... కొత్త వివాదంలో చిక్కుకుంది.  తాజాగా ఏపీలోని ఏలూరు జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఇప్పుడు ఇదే  రేవ్ పార్టీ.. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు కొత్త చిక్కులు తీసుకొచ్చింది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామం బావాయి పాలెంలో రేవ్ పార్టీ ఇచ్చాడు జనసేన పార్టీ నాయకుడు. మండల స్థాయి జనసేన నాయకుడు ఇంద్రకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ  రేవ్  పార్టీ ఏర్పాటు చేశారు.  ఈ నెల 12వ తేదీన ఓ రైస్ మిల్లులో  ఈ రేవ్ పార్టీ నిర్వహించాడు జనసేన నాయకుడు ఇంద్రకుమార్.  అయితే.. పుట్టినరోజు సందర్భంగా మందు పార్టీ పెడితే తప్పులేదు కానీ.. మనోడు.. రేవ్‌ పార్టీ పెట్టాడు.
ఇందులో అశ్లీల నృత్యాలు చేశారు కొందరు మహిళలు. బట్టలు లేకుండానే... జనసేన నేతలతో డ్యాన్సులు చేశారు ఆ మహిళలు. దాదాపు 5 మంది మహిళలతో.. ఈ రేవ్‌ పార్టీ నిర్వహించాడట జనసేన నాయకుడు ఇంద్రకుమార్. లక్షల్లో ఖర్చు పెట్టి మరీ...  5 మంది మహిళలతో.. ఈ రేవ్‌ పార్టీ నిర్వహించాడట జనసేన నాయకుడు ఇంద్రకుమార్. అయితే... రేవ్‌ పార్టీ, అశ్లీల నృత్యాల వీడియోలు బయటకు వచ్చాయి.
దీంతో రేవ్‌ పార్టీ, అశ్లీల నృత్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది.  దీంతో ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీకి చెందిన రేవ్‌ పార్టీ కలకలం రేపింది. రాజకీయ విభేదాల నేపథ్యంలోనే.. వీడియోలను లీక్ చేశారని సమాచారం అందుతోంది.  దీనిపై వివాదం నెలకొనడంతో..జనసేన పార్టీలో ఉన్న పదవి నుంచి ఇంద్రకుమార్ ను తొలగించారట.
అయితే... ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతోందని.. ప్రశ్నించిన పవన్‌ కళ్యాణ్‌... ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటిపై స్పందించడం లేదు. జనసేనకు చెందిన జానీ మాస్టర్‌ ఘటన మరువక ముందే... మరో నేత రేవ్‌ పార్టీ బయటకు వచ్చింది. ఇంత జరుగుతున్నా... చీమ కుట్టినట్టుగా వ్యవహరించడం లేదని పవన్‌ కళ్యాణ్‌ పై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: