సాధారణ ఎన్నికల రేంజ్‌లో.. జర్నలిస్ట్ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కోపరేటవ్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగాయి. ఈ ఎన్నికల్లో గోపరాజు ప్యానల్‌ నుంచి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. మొత్తం 9 మంది మేనేజింగ్‌ కమిటీ మెంబర్లుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో గోపరాజు, రవీంద్ర బాబు, కమల్, లక్ష్మీ నారాయణ, చల్లా భాగ్య లక్ష్మీ, స్వేచ్ఛ వోటార్కర్‌, మహేష్ విజయం సాధించారు.

జర్నలిస్ట్ కోపరేటవ్‌ హౌసింగ్‌ సొసైటీ  ఎన్నికల అంకం ముగిసింది. గోపరాజు అండ్ కో మెజారిటీ సీట్లు గెలిచారు. ఎన్నికలు ముగియడంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై దృష్టి పెట్టాలని సభ్యులు కోరుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న నాయకుల కారణంగానే నాన్ ఎలాటీస్ కు ఇండ్ల స్థలాలు రాలేదని అనేక మంది ఆరోపించారు. అందుకే నాన్ ఎలాటీస్ ప్యానెల్ కు కసితో ఓట్లు వేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే నాన్‌ ఎలాటీస్‌ ప్యానల్‌గా ఉన్న గోపరాజు ప్యానెల్ లో ఇద్దరు ఓడిపోయి, గత కమిటీ లో ఉన్న ఇద్దరు మళ్లీ గెలిచారు. ఆ ఇద్దరిలో ఒకరి గురించి.. వారి అవినీతి గురించి పోస్ట్ లు కూడా వచ్చాయి. అంటే నాన్ ఎలాటీస్ కు ఇండ్ల స్థలాలు రాకపోవడానికి ఎవరూ కారణం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా విజేతలు అందరికీ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత ఇక పోస్ట్ మార్టం అనవసరం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గెలిచిన మిత్రులు అందరికి అభినందనలు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి 70+ వయసులో కూడా వచ్చి ఓటు వేసిన సీనియర్లకు నమస్కారాలు.. పోరాడి ఓడిన సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు.. మరో పక్షం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గోపరాజు, మిక్కిలినేని సారధ్యంలో 2025లో అయినా మన సొంత ఇంటి కల నెరవేరాలని జర్నలిస్టు మిత్రులు ఆకాంక్షిస్తున్నారు. మరి కొత్త ప్యానల్‌ ఏం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: