పరుచూరు రాజకీయాల్లో ' ఏలూరి ' కి ఎదురు లేదు..ప్రజాభిమానంలో సాంబకు తిరుగులేదు ..!
ఏలూరి సాంబశివరావు. రాజకీయాల్లో విజయానికి కేరాఫ్ గా నిలిచిన ప్రకాశం జిల్లా నాయకుడు. అనేక మంది నాయకులు ఓడిగెలిచిన వారు ఉన్నారు. కానీ, ఎన్ని ప్రభంజన వీచికలు వీచినా.. తనదంటూ ప్రత్యేకతను చాటుకోవడంతోపాటు..తనకంటూ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకున్న ఏకైక నాయకుడు.. ఏలూరి సాంబశివరావు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన 2014 నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. ఎంతో సంక్లిష్టమైన పరుచూరు నియోజకవర్గంలో ఓ యంగ్ లీడర్‌గా ఎంట్రీ ఇచ్చి ఈ రోజు హ్యాట్రిక్ విజయాలతో రాష్ట్ర రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసుకున్నారు.
నిజానికి 2019లో జగన్ పాదయాత్ర కారణంగా.. ప్రజల్లో పెల్లుబికిన సెంటిమెంటు.. అనేక మంది సీనియర్ల ను కూడా ఓడించింది. కానీ, ఏలూరి విషయంలో మాత్రం ఈ సెంటిమెంటు ఏమాత్రం పనిచేయలేదు. ఆయన ప్రజలకు అంకితమైన తీరు.. ప్రజలతోనే ఉన్న విధానం.. వంటివి ఆయనకు విజయాన్నిచేరువ చేశాయి. ఎక్కడా ఆయన టైం వేస్టు వేయరు.. అనే మాట ప్రజల్లో వినిపిస్తుంది. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు కూడా.. నేనున్నానంటూ.. ఆయన కార్యాలయ ద్వారాలు ఎప్పుడూ తీసే ఉంటాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతుల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు.
సొంత వ్యాపారాలు.. సొంత వ్యవహారాలు ఎన్ని ఉన్నా..అనునిత్యం ప్రజలకు చేరువ అయిన నాయకుడి గా ఏలూరి ప్రత్యేకంగా నిలిచారు. ప్రజలతోనే జీవితం అనే మాట చెప్పడమే కాదు.. వంద శాతం అమలు చేసిన నాయకుడు కూడా ఏలూరి సాంబశివరావు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ఆయనను మూడు ఎన్నికల్లోనూ విజయం వరించేలా చేసింది. ఇన్ని విజయాలు దక్కించుకున్న ఏలూరి.. కూటమి సర్కారులో కీలక పదవి ఆశించారు.
త్వరలో ఏలూరికి కీలకమైన నామినేటెడ్ పదవి వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరి పరుచూరు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగానే కాకుండా.. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. ఇటీవలే ఏలూరికి ప్రతిష్టాత్మకమైన బ్రిటన్ పార్లమెంటు విజనరీ లీడర్ అవార్డు కూడా దక్కింది. ఏలూరికి పదవి వ్యామోహం కంటే ప్రజల మనసులు తెలిసిన నాయకుడు కావడంతో వారి కోసమే రాజకీయాలు చేస్తుంటారు. పదవులు.. వెతుక్కుంటూ రావాలే తప్ప.. వాటి కోసం తాను వెతుక్కోనని చెప్పే ఏలూరి.. అదే అంకిత భావంతో ఉంటారు. పరుచూరు రాజకీయాల్లో ఏలూరికి ఎదురు లేదు..ప్రజాభిమానంలో ఆయనకు తిరుగులేదు.. అనే మాట వినిపించడానికి కారణం ఇదే..!