తెలుగు పొలిటికల్ హిస్టరీలోనే పరిటాల మార్క్ రేర్ రికార్డ్ ఇది..!
దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కు ఎలాంటి ? క్రేజ్ ఉందో తెలిసిందో. ఆయన మృతి చెంది రెండు దశాబ్దాలు అవుతున్న పరిటాల పేరు ఎప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఒక బ్రాండ్. పరిటాల రవి మరణం తరం ఆయన రాజకీయ వారసురాలుగా ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చి రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలలో పరిటాల వారసుడు శ్రీరామ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో కి దిగి రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో సునీత మరోసారి రాప్తాడు నుంచి విజయం సాధించారు. ఇదిలా ఉంటే పరిటాల కుటుంబం తెలుగు రాజకీయాల చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించింది. పరిటాల స్వగ్రామం వెంకటాపురంలో 100% మోటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని కొత్త చరిత్ర సృష్టించారు.
శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం నసకోట పంచాయతీ 225 పోలింగ్ బూత్ పరిధిలో వెంకటాపురం ఉంది మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా 11 మంది చనిపోయారు. మిగిలిన 570 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 100 % తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న మొదటి గ్రామంగా వెంకటాపురం రికార్డుల్లోకి ఎక్కింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉమ్మడి జిల్లాలో ఈ రికార్డు సాధించిన ఏకైక క్రమంగా వెంకటాపురం గెలిచిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో హిందూపురం పార్లమెంటు రాష్ట్రంలోని రెండో స్థానంలో ఉంది. పార్లమెంటు పరిధిలో కదిరి 70,000 సభ్యత్వాలతో మొదటి స్థానంలో ఉంటే 67 వేల సభ్యత్వాలతో రాప్తాడు రెండో స్థానంలో ఉంది. పార్లమెంటు పరిధిలో మొత్తం 4.50 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.