ఇదేం తీరు ఎమ్మెల్యే గారూ..??
కంభంపాడులో ఈ నేత ఒక స్థలాన్ని ఆక్రమించి, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కూడా నిర్మించినట్లు రూమర్స్ వచ్చాయి అంతేకాదు బాధితులు ఆ భవనాన్ని కూల్చేయాలంటూ పెద్ద రచ్చ చేశారు. ఈ ఏడాది జులైలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. చంద్రబాబు కూడా కొలికపూడి శ్రీనివాసరావుని తన దగ్గరికి పిలిపించుకొని మరీ ఘాటు వార్నింగ్ ఇచ్చారట. ఆ తర్వాత కూడా ఆయన తీరు మారలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. పేకాట శిబిరాలు పెట్టడమే కాకుండా టీడీపీ ప్రతినిధులను గుడ్డలిప్పదీసి తంతా అంటూ దుర్భాషలాడుతున్నారట. ఇలాంటి మాటలు భరించలేక ఓ ప్రజాప్రతినిధి భార్య సూసైడ్ అటెంప్ట్ కు కూడా పాల్పడటం జరిగింది.
అక్రమ మట్టి తరలింపు విషయంలో కూడా ఈయన ప్రమేయం ఉందని రూమర్స్ వచ్చాయి. ఈ విషయాన్ని బయటపెట్టిన మీడియా వర్గాలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇక లాభం లేదని టీడీపీ నాయకులు ఉన్నత నేతలకు ఫిర్యాదు చేస్తే గట్టిగా మందలించారు. దీంతో ఆయన కొద్ది రోజులు గప్‌చుప్ అయ్యి మళ్లీ మంగళవారం తన విచిత్ర వైఖరిని బయటపెట్టారు. మంగళవారం ఆయన బెల్ట్ షాపులకు వెళ్లి వాటిని మూయించారు. పట్టణంలో ఉన్న ఈ బెల్టు షాపులను పట్టణం అవతలకు తరలించారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో షాపులను తీసేయకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని, అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా హెచ్చరించారట.
బెల్ట్ షాపుల యజమానులు అసలే తమ ఉత్పత్తులకు గిట్టుబాటు కాక నష్టాల్లో మునిగితేలుతున్నారు. వారిని ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. షాపుల నిర్వహణలో ఏదైనా లోపాలు ఉంటే ఎక్సైజ్ అధికారులకు చెప్పాలి కానీ ఇలా ఎమ్మెల్యే దాదాగిరీ చేయడం ఏంటని ఏకపారేస్తున్నారు.