ఏపీ సిఎం: ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది తీపికబుర్లు ఇవే..!
గత కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఖజానాలో డబ్బులు లేవని చూపుతూ ఉన్నప్పటికీ.. వేలకు వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు చేపట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం పైన పెదవి ప్రజలు విరుస్తూ ఉన్న సమయంలో వచ్చే నెల నుంచి సంక్షేమల పైన ఫోకస్ పెట్టారట ఏపీ సీఎం.. ఒకవైపు అమరావతి మరొకవైపు పోలవరం పనులు కూడా ప్రారంభిస్తూ ఉండడంతో అదే నెలలోనే సంక్షేమాలకు కూడా పెద్దపీట వేయాలని ఆలోచిస్తూ ఉన్నారట.
అలాగే అప్పుల కోసం ఢిల్లీకి వెళ్లి మరి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సంక్రాంతి నుంచే అమలు చేయాలని కొత్త ఏడాదిలో తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయాలని ఆ వెంటనే రైతులకు పెట్టుబడి సహాయం కింద ₹20,000 కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారట వీటితోపాటు మహిళలకు 1500 రూపాయలు ప్రతినెల ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి జనవరి నెల నుంచి అన్ని సంక్షేమాలను పరుగు పెట్టించాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇప్పటికే వాలంటరీలను మోసం చేశారని.. అటు వాలంటరీలు కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఇటీవలే ధర్నాలు చేస్తున్నారు. వీటికి తోడుగా నిరుద్యోగులు కూడా త్వరలోనే ధర్నా చేయబోతున్నారట. ఇలా ఇవే కాకుండా మరెన్నో చిక్కులు ఏపీ సీఎం చంద్రబాబు దాటుకుంటారేమో చూడాలి.