రేవంత్‌ స్కెచ్‌.. శుక్రవారం మరో ముహుర్తం ఫిక్స్‌..ఇద్దరికీ ఒకేసారి ?

Veldandi Saikiran

అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షో డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో వేసారు. పుష్ప-2 సినిమాను చూడడానికి అక్కడికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాకుండా అక్కడికి అల్లు అర్జున్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడడానికి వచ్చాడు. ఈ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో జనాలు ఎగబడ్డారు.

దీంతో అక్కడ తొక్కి సలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. రేవతి తో పాటు తన కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో శ్రీ తేజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇతడికి కావాల్సిన వైద్య సహాయాన్ని అల్లు అర్జున్ చేపిస్తున్నాడు. రేవతి మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల సహాయం చేశాడు. అంతేకాకుండా తన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటానని వెల్లడించాడు.

రేవతి మరణం పట్ల తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి గల ప్రధాన కారణం పుష్ప-2 సక్సెస్ మీట్ సమయంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మరచిపోయాడు. అందుకు రేవంత్ రెడ్డి కోపంతో అల్లు అర్జున్ ను అరెస్టు చేయించాడని కొంతమంది అంటున్నారు. ఈ విషయం మీద రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ ఈ విషయం మీద తనకు ఎలాంటి కోపం లేదని, తెలంగాణ పోలీసులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని నాకేమీ కోపం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
అల్లు స్నేహారెడ్డి కుటుంబ సభ్యులు మాకు బంధువులేనని రేవంత్ రెడ్డి చెప్పాడు. కాగా, అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. తన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారని అంటున్నారు. ఒకవేళ బెయిల్ కనుక రద్దు అయితే అల్లు అర్జున్ శుక్రవారం మరోసారి అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. మరి అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అనే సందేహంలో అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారట. ఇటు కేటీఆర్‌పై కేసు నమోదు అయిన తరుణంలో... రేపు అరెస్ట్‌ చేస్తారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: