ఏపీ: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు..జనసేన నేతలు బంపర్ ఆఫర్.. మరి పార్టీ మారేనా..?

Divya
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి క్రేజ్ బాగానే పెరిగింది..2024 కూటమిలో జతగా గెలవడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తన జనసేన పార్టీని సైతం మరింత బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో మంచిపట్టు ఉన్నది. అలాగే రాయలసీమలో కూడా జనసేన పార్టీకి మరి కొంత బలాన్ని పెంచేందుకు ఇతర పార్టీలలో ఉండే కీలకమైన నాయకుల పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా సమాచారం. రాయలసీమలో పట్టు ఉన్న నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇలాంటి సమయంలోనే అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసిపి నేతగా పేరుపొందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జనసేన పార్టీలోకి చేర్చుకోవడం కోసం చాలామంది నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా కేతిరెడ్డి నిత్యం ప్రజలలో ఉంటూ వారి యొక్క అవసరాలను సైతం తెలుసుకొని మరి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా పేరు సంపాదించారు. గత ఎన్నికలలో తప్పకుండా ఈయన మంచి విజయాన్ని సాధిస్తారు అనుకున్నప్పటికీ ఊహించని విధంగా కేతిరెడ్డి ఓడిపోవడంతో కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత వైపాక తీరు పైన కొన్ని విమర్శలు చేసిన.. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని సద్దుమణుగుతున్న సమయంలో కొంతమంది జనసేన నేతలు ఈ నాయకుడిని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ని కలిసిన కొంతమంది జనసేన నేతలు ఆయనకు ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించినట్లు సమాచారం. పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు కూడా ఇప్పిస్తామని ఆశ చూపించినప్పటికీ కేతిరెడ్డి మాత్రం తాను వైసిపి పార్టీలోనే ఉంటానని జగన్ ని వదిలి బయటికి రాలేనని కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  జనసేన నేతలు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను  తిరస్కరించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నాయకులే పార్టీలకు కావాలి అంటూ పలువురు నేతలు అభిమానులు కూడా ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: