స్పీకర్ అయ్యన్న: ఏపీలో 3.20 లక్షల దొంగ పింఛన్లు ?
అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు ఉన్నాయన్నారు. ఈ పెన్షన్ల కారణంగా ఐదేళ్లకు అయితే రూ.7200 కోట్లు వృధా అవుతున్నాయని ఫైర్ అయ్యారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
ఈ 7 వేల కోట్లు మిగిలితే తాండవ రిజర్వాయర్ లాంటివి మూడు కట్టొచ్చు అంటూ చంద్రబాబు నాయుడు సర్కార్‌కు సూచనలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ... దొంగలే అని అంటాను అంటూ రెచ్చిపోయారు. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పానని గుర్తు చేశారు. ఇక ఈ దొంగ పెన్షన్లపై చూద్దాం అని అన్నారని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ఇక్కడ చెప్పొచ్చో లేదో అంటూనే... ఎవరేమనుకున్నా లెక్క చేయనంటూ తన పాత తరహా పందా లోనే నా స్టైలే వేరు అంటూ... ప్రసంగించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఏపీ అప్పుల్లో ఉందని.. ఇప్పుడు ఇలాంటి కోతలు పెట్టాలని సూచనలు చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై వైసీపీ పార్టీ సీరియస్ అవుతోంది.