అసెంబ్లీలో చెప్పు విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. BRS ఆరోపణ.. వీడియో వైరల్?
ఇక ఈ క్రమంలో ఇంతకీ బీఆర్ఎస్ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ ఎట్టకేలకు సభను వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... కేటీఆర్‌కి ఫార్ములా ఈ రేస్ మీద సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా! అని అడిగారు. ఈ క్రమంలోనే కేటీఆర్ మాట్లాడితే మీకు, ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టమైన క్లారిటీ వస్తుందని అడుగుతూ... ఇది ముమ్మాటికి అక్రమ కేసు... అందుకే మీరు మా నాయకుడికి మాట్లాడే అవకాశం కల్పించడం లేదు అని మండిపడ్డారు హరీశ్.
కాగా కేటీఆర్‌కు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏ1గాను, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ1గాను ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అసలు విషయంలోకి వెళితే... అసెంబ్లీలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత, అసభ్య ప్రవర్తన ఇపుడు పెనుదుమారం రేపుతోంది. విషయం ఏమిటంటే.. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పు చూపించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ... అసెంబ్లీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్పీకర్ పై పేపర్లు విసరడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దళిత స్పీకర్ అయినందుకే అగ్రకుల దుహంకారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.