ఏపీ: టిడిపి మహిళ ఎమ్మెల్యే పై సంచలన ఆరోపణలు చేస్తున్న టిడిపి కార్యకర్త..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాద సృష్టిస్తామని దీంతో నిరుద్యోగులు లేకుండా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల ముందు అటు నిరుద్యోగులకు కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.. దీంతో ఎట్టకేలకు హామీల వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతలు ఒక్కొక్కరుగా తమకు తోచిన విధంగా దోచుకుంటున్నారనే విధంగా వైసీపీ నేతలు సైతం తెలియజేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా  శింగనమల నియోజవర్గం మహిళ ఎమ్మెల్యేగా గెలిచిన బండారు శ్రావణి గురించి పలు రకాల ఆరోపణలు టిడిపి కార్యకర్తలు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే ఎమ్మెల్యేగా గెలిచిన బండారు శ్రావణి .. పెత్తనం మాత్రం ఆమె తల్లి లీలావతి చేస్తోందనే విధంగా గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.. తమ నియోజకవర్గంలో ఎలాంటి పని జరగాలన్నా కూడా శ్రావణి తల్లి వద్దకే కార్యకర్తలు నేతలు వెళ్లాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకు ఉదాహరణగా ఇప్పుడు జరిగిన విషయాన్ని వైసిపి నేతలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుస్తున్నారు. సొంత కార్యకర్తలే టిడిపి పార్టీకి గత 30 ఏళ్లుగా ఉన్నవారు బండారు శ్రావణి పైన చేదు అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జరిగిన సంఘటన విషయానికి వస్తే 30 ఏళ్లుగా టిడిపి పార్టీకి సేవలు అందిస్తున్నప్పటికీ తమకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వలేదని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకి దిగారు.. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు శ్రావణి తల్లి లీలావతి 5 లక్షల రూపాయలకు అమ్ముకుంటోంది అంటూ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ విషయాన్ని టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ కు కంప్లైంట్ చేస్తారనే విషయం పై తన పైన తనమీద తప్పుడు కేసులు ఎమ్మెల్యే పెట్టిస్తున్నారనే విధంగా టిడిపి కార్యకర్త కణంపల్లి ప్రసాద్ ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయం పైన అధిష్టానం ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: