హెరాల్డ్ పాలిటిక్స్ 2024: ఒక్కటే దెబ్బ..డిప్యూటీ సీఎం, 100 శాతం స్ట్రైక్ రేట్...ఇక తిరుగులేదు ?
* పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా పవన్ విజయం
* డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు
* కేంద్రంలో చక్రం
దాదాపు పది సంవత్సరాలకు పాటు... ఎమ్మెల్యేగా గెలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. చాలా పార్టీలతో కలిసారు. అందరితో నడిచారు. జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలపై... ప్రజల గొంతుకను వినిపించారు. కానీ... గత పది సంవత్సరాలలో.. రెండుసార్లు ఓటమి చవిచూసారు పవన్ కళ్యాణ్.
కానీ 2024 సంవత్సరంలో... పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు పవన్ కళ్యాణ్. భారీ మెజారిటీతో వైసిపి పార్టీని చిత్తు చేసి మరి... పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో కూటమి... అధికారంలోకి రావడానికి.. పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. టిడిపి, భారతీయ జనతా పార్టీ అలాగే, జనసేన పార్టీలను కలిపేందుకు.... చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్.
దాని ఫలితంగానే... ఏపీలో జనసేన పార్టీ వందకు వందశాతం... స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడంటే అప్పుడు మోడీ అపాయింట్మెంట్.... పవన్ కళ్యాణ్ కు మాత్రమే దొరుకుతోంది. ఇక మరో నాలుగు సంవత్సరాలు... పార్టీని బలోపేతం చేసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ప్రచారం కూడా దొరుకుతుంది.