ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. నిత్యం నరాలు తెగే ఉత్కంఠతో ఈ ఎన్నికలు సాగాయి.. కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో అప్పటి అధికార పార్టీ వైసీపీ మధ్య హోరాహోరి పోరు జరిగింది.. రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరగడంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది..జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముందు నుంచి బీజేపీతో సాన్నిహిత్యంగా వుంటూ ఆ పార్టీతో కొనసాగిస్తూ వస్తున్నారు..రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవడం ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబుని జైలులో పెట్టడంతో రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి.చంద్రబాబుని కలిసేందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్ ని సైతం నడిరోడ్డు మీదే నిలిపివేయడం సంచలనంగా మారింది.. చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది.. తాను టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి పవన్ కల్యాణ్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు.. పొత్తుకి బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్డియే కూటమి ఫామ్ అయింది..హోరా హోరి ప్రచారంతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది..అనుకున్న విధంగానే ఈ ఎన్నికలలో కూటమి సంచలన విజయం సాధించింది..జనసేన పార్టీ పోటీచేసిన 21 నియోజకవర్గాలను ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది..
అయితే 2019 లో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన ఈ రేంజ్ కి ఎదగడంలో ఆ పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కృషి కూడా ఎంతగానో ఉపయోగపడింది.. పవన్ సినిమాలలో బిజీగా వున్న సమయంలో నాదెండ్ల అన్నీ తానై వుంటూ పార్టీని ముందుండి నడిపించాడు.. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మంత్రిగా, స్పీకర్ గా పని చేసిన అనుభవం ఎంతో ఉంది.. జనసేన పార్టీనే అంటిపెట్టుకొని ఆ పార్టీ ఎదుగుదలకై తీవ్ర కృషి చేసారు.. ఈ ఎన్నికలలో పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి మంచి విజయం సాధించారు.. అలాగే కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల మంత్రిగా కీలక భాద్యతలు చేపట్టారు.. అయితే మంత్రిగా మనోహర్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు..ఇటీవల రేషన్ అక్రమ రవాణను గుర్తించి దానిపై చర్యలు తీసుకోవడం చర్చనీయంశంగా మారింది..పవన్ కళ్యాణ్ తో పాటు అవినీతికి వ్యతిరేకంగా మనోహర్ పోరాటం చేస్తున్నారు..