HBD: వైయస్ జగన్ ..పేదల బతుకు మార్చిన మహానేత..!

Divya
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేతగా తన 52వ పుట్టినరోజున ఈ రోజున చేసుకోబోతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక సంచలనాలకు తేర తీయడం జరిగింది.. దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడు గా పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి జాతీయస్థాయి పార్టీని ఎదిరించి మరి నిలబడిన నాయకుడిగా పేరు సంపాదించారు.. 2011లో వైసీపీ పార్టీని ప్రకటించారు.. 2014 ఎన్నికలలో సీఎంగా గెలవలేకపోయారు.. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఒక సునామినే సృష్టించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 151 యొక్క సీట్లు సాధించారు.

2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు ఎన్నో విధాలుగా అండగా నిలిచారు.. సచివాలయ ఉద్యోగాల పేరుతో ప్రతి గ్రామంలో కూడా అన్ని సేవలు అక్కడే అందించడమే కాకుండా వాలంటరీల పేరుతో ఇంటి వద్దకే అన్ని సేవలను అందించారు.. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు చదువుతోనే మారుతుందని గుర్తించి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఉద్దేశంతోనే అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చి పిల్లలను బడికి పంపించేలా చేశారు.. అలాగే 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు 18 వేల రూపాయల సహాయాన్ని కూడా అందించారు.

విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి గ్రామాలలోనే పేద ప్రజలకు ఇంటి వద్దకే వెళ్లి మరి ఉచిత వైద్యాన్ని అందించాలనే విధానాన్ని కూడా తీసుకోవచ్చారు. వీటితోపాటు రైతు భరోసా కేంద్రాలను గ్రామాలలో అమర్చి అలాగే భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా ప్రతి ఏడాది 13,500 రూపాయలను అందించారు. అలాగే వాహన మిత్ర వంటి వాటితో కూడా ఎంతోమంది పేద ప్రజలకు సహాయాన్ని అందించారు. ఇల్లు లేని వారందరికీ ఇల్లు స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించేలా చూశారు.. అలాగే ప్రభుత్వ బడులను కూడా ప్రైవేటు స్కూళ్లకు దీటుగా నిర్మించడం జరిగింది. ఇలా ఇవే కాకుండా ఎన్నో చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి..అయితే ఇన్ని చేసినా కూడా 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది వైసిపి పార్టీ.. మరి వచ్చే ఎన్నికలకు ఏ విధంగా తన మార్కు చాటుకుంటారో చూడాలి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తమ అధినేత  పుట్టినరోజు వేడుకలను సైతం చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు కార్యకర్తలు నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: