హెరాల్డ్ పాలిటిక్స్ 2024 : ఆ తప్పుల వల్లే పార్టీని ముంచేసిన జగన్.. అందరివాడు ఒంటరివాడయ్యాడా?
రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే జగన్ గెలిచేవారని చాలామంది ఇప్పటికీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. గత ఐదేళ్లలో జగన్ చెప్పిన ప్రతి హామీని అమలు చేశారు. అయితే సంక్షేమంకు ప్రాధాన్యత ఇచ్చిన స్థాయిలో అభివృద్ధికి ఇవ్వలేకపోవడంతో జగన్ కు, జగన్ పార్టీకి ఆశించిన ఫలితాలు అయితే రాలేదని చెప్పవచ్చు. పులివెందులలో సైతం జగన్ పట్టు కోల్పోతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తే మంచి ఫలితం ఉంటుందని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా ఆయన మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. ఏపీలో కూటమికి ప్రత్యామ్నాయం ఏదనే ప్రశ్నకు వైసీపీ పేరు సమాధానంగా వినిపిస్తుంది. సరైన విధంగా అడుగులు వేస్తే మాత్రం జగన్ కు పూర్వ వైభవం రావడం కష్టమేం కాదు. మేధావుల సలహాలు తీసుకుని జగన్ ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.
అయితే వైసీపీ విషయంలో జగన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా జగన్ అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. జగన్ కు తల్లి సపోర్ట్ కానీ చెల్లి సపోర్ట్ కానీ లభించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. జగన్ కు 2025 పొలిటికల్ గా కలిసిరావాలని ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలని ఆశిద్దాం. జగన్ అద్భుతమైన వ్యూహాలతో ముందడుగులు వేస్తే మాత్రమే 2029 సంవత్సరంలో పార్టీకి అధికారం దక్కే అవకాశం అయితే ఉంది.