హెరాల్డ్ పాలిటిక్స్ 2024 : బాలయ్య ... ఇద్దరు అల్లుళ్ల పొలిటికల్ బ్లాక్బస్టర్ సినిమా...!
ఈ యేడాది నందమూరి బాలకృష్ణ తో పాటు ఆయన ఇద్దరు అల్లుల్లకు రాజకీయంగా బాగా కలిసి వచ్చిన యేడాది. నిజం చెప్పాలి అంటే బాలయ్య వరుస సూపర్ డూపర్ హిట్ సినిమా లతో దూసుకు పోవడం ఏమో గాని.. ఈ యేడాది బాలయ్య తో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్లు కలిసి పొలిటికల్ బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పాలి. 2019 యేడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన బాలయ్య అల్లుళ్లు ఇద్దరూ ఓడిపోయారు. అది నిజంగానే వాళ్లకు కెరీర్ పరంగా ఘోర అవమానం మిగిల్చింది. అయితే ఐదేళ్ల పాటు కఠోరంగా పడిన కష్టం వారిని ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చింది.
బాలయ్య హిందూపురం నుంచి వరుసగా మూడో సారి టీడీపీ తరపున రికార్డు మెజార్టీ తో ఎమ్మెల్యే గా గెలిచారు. అక్కడ ఆయనకు హ్యాట్రిక్ విజయం . ఇక బాలయ్య పెద్దళ్లుడు నారా లోకేష్ కు ఇది నిజంగానే చరిత్రలో నిలిచి పోవాల్సిన యేడాది. లోకేష్ మంగళగిరిలో ఎక్కడ అయితే ఓడిపోయాడో అక్కడే ఏకంగా కనీవినీ ఎరుగని రేంజ్ లో రికార్డు స్థాయిలో 92 వేల ఓట్ల భారీ మెజార్టీ తో ఘనవిజయం సాధించి పడిన చోటే లేచి నిలబడి సగర్వంగా విజయం సాధించారు.
ఇక బాలయ్య చిన్న అల్లు డు .. వైజాగ్ గీతం విద్యా సంస్థల అధినేత అయిన మొతుకుమిల్లి శ్రీ భరత్ 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేసి కేవలం 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ యేడాది ఏకంగా 5.03 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో దేశ చరిత్ర లోనే టాప్ - 5 మెజార్టీ ల్లో ఒక్కటి సాధించి గర్వంగా పార్లమెంటు లోకి అడుగు పెట్టారు. అలా బాలయ్య తో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్ల కు ఈ యేడాది పొలిటికల్ సినిమా బ్లాక్ బస్టరే అయ్యింది.