అల్లు అర్జున్ అరెస్టుపై.. పురందేశ్వరి ఏమన్నారంటే..?

Divya
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కేసలాటలో భాగంగా అల్లు అర్జున్ జైలుకు పంపించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం.. అయితే ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. దీంతో చాలామంది కూడా అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్లగా మరికొంతమంది తెలంగాణ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. నిన్నటి రోజున అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ అరెస్టు పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ అభిమానులనే కాకుండా అల్లు కుటుంబాన్ని కూడా కాస్త బాధను కలిగించాయితీతో నిన్నటి రోజున అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ విషయం పైన తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు బిజెపి ఎంపీ పురందేశ్వరి స్పందిస్తూ పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో సినీ హీరో అల్లు అర్జున్ కేవలం థియేటర్ వద్దకు ఒక నటుడుగా మాత్రమే వెళ్లారని మిగతా వారిని అరెస్టు చేయకుండా అల్లు అర్జున్ మాత్రమే అరెస్టు చేయడం కరెక్ట్ కాదంటూ ఆమె తెలియజేసింది. ఆ తర్వాత జమిలి ఎన్నికల పైన మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలకు సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును సైతం జాయింట్ పార్లమెంటు కమిటీ ముందుకి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపింది.

జమిలి ఎన్నికలు ఆనేవి ఒక పార్టీ ప్రవేశపెట్టినటువంటి అంశము కాదని దీనిపైన అన్ని పార్టీల ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటారని అలాగే వీటి వెనుక మంచి చెడు నిర్ణయాలు కూడా తీసుకుంటారని తెలిపింది. ఆ తర్వాత ఉభయసభలలో బిల్లును సైతం ప్రవేశపెట్టి చర్చ జరిపిన తర్వాత ఓటింగ్ జరుగుతుందని అంతేతప్ప ఇప్పటికి ఇప్పుడు ఏదో అయిపోతుందని ఎవరు గందరగోళం పడవద్దు అంటూ తెలిపింది బిజెపి ఎంపీ పురందేశ్వరి. ఓటింగ్ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాతే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది పురందేశ్వరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: