సొంత ఎమ్మెల్యేపైనే టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం..?
కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి కేసులు పెట్టించుకుని, కష్టాలను భరించి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని అక్కడి నేతలు వాపోతున్నారు. గతంలో తెదేపా నేత, కడప టీడీపీ అధ్యక్షుడు సానపు రెడ్డి శివ కొండారెడ్డి పై కర్రలతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ దాడిలో ఏ1 ముద్దాయిగా ఉన్న అతన్ని తీసుకెళ్లి చంద్రబాబుకి పరిచయం చేశారు కడప ఎమ్మెల్యే మాధవి. ఈ విషయం తెలిసి టీడీపీ యాక్టివిస్టులు ఒక్కసారిగా తీవ్ర కోపంలో వ్యక్తం చేశారు.
పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న తమను పక్కనపెట్టి తమను ప్రోత్సహించాల్సింది పోయి, కొత్తగా నిన్న కాక మొన్న వచ్చిన వారిని అధిష్టానానికి పరిచయం చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా టీడీపీ జెండా పట్టుకుని వ్యక్తిని తీసుకెళ్లి చంద్రబాబుకు పరిచయం చేయడం ఎంతవరకు సబబు అని ముఖం పట్టుకొని మరీ అడుగుతున్నారు. ఈ విషయంపై చంద్రబాబు అయినా దృష్టి పెట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే తీరు ఇలా ఉండటంపై సర్వత్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రెడ్డప్పగారి మాధవి రెడ్డి కార్యకర్తలు చేస్తున్న విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి. వారికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకుంది అని పొలిటికల్ అనలిస్టులు కామెంట్లు చేస్తున్నారు.