తెలంగాణలో ఉండాలంటే వీసా తీసుకోవాలా?

Veldandi Saikiran
అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభేదాలు తెచ్చే దిశగా వెళ్తున్నాయి. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ రాజకీయ నేతల మధ్య.. మాటల యుద్ధం కూడా షురూ అయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై... బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు, ఏపీ లో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ వాళ్లు ఉండాలంటే వీసా కావాలా? అంటూ ప్రశ్నించారు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి.
 

ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ను ఆంధ్రోడు  అంటూ... రెచ్చిపోయి మాట్లాడారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. బతకడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చాడని... అలాంటి వాళ్ల సినిమాలను తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చాడు. భే షరతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... వెంటనే క్షమాపణలు చెప్పాలని... లేకపోతే తాటతీస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాడు భూపతి రెడ్డి.
 

అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉండాలంటే ప్రత్యేక వీసా తీసుకోవాలా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత కూడా... ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటని... ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి.
 

ఇదేనా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి? వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే... కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం క్షమించబోదని ... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.... అల్లు అర్జున్ పైన చేసిన వ్యాఖ్యలపై... ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ స్పందించలేదు. అతనిపై చర్యలు కూడా తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: