ఏపీ: సంక్రాంతి సెలవలలో మార్పు.. ఎప్పుడేప్పుడు అంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ,విద్యార్థులు సైతం ఎప్పుడేప్పుడ సంక్రాంతి సెలవులని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ మేరకు ఇటీవలే పదవ తరగతి ఎగ్జామ్లను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవు దినాలను ఉంచేలా పలు రకాల ప్రణాళికలను చేపట్టింది. అది కూడా 13,14,15 తేదీలలో ఇచ్చేలా చేపట్టిందట .పరీక్షల తేదీలలో కూడా రోజు మార్చి నుంచి మొదలు కావడంతో రోజు మెయిన్ ఎగ్జామ్స్ జరిపేయాల చూస్తున్నామంటూ మంత్రి నారా లోకేష్ కూడా వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా సంక్రాంతి సెలవులలో మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

అకాడమీ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులలో మారుస్తూ 2024-2025 క్యాలెండర్ ప్రకారం జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీలలో ఉంటాయంటూ గతంలో విద్యాశాఖ తెలియజేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భారీ వర్షాలు పడుతూ ఉండడం చేత చాలా జిల్లాల స్కూళ్లకు సైతం సెలవులు ఇవ్వాలంటూ కలెక్టర్లు కూడా ఆదేశాలను జారీ చేశారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఉద్యోగుల పని దినాలను దృష్టిలో పెట్టుకొని ఈ సెలవులను తగ్గించే విధంగా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసిందట.. అయితే ఈసారి 11 నుండి 15 లేదా 12 నుంచి 16వ తేదీలలో పొంగల్ హాలిడేస్ ని ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా కూడా ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం నుంచి రాబోతున్నట్లు సమాచారం.

అయితే వీటి పైన కొంతమంది విమర్శిస్తూ ఉన్నప్పటికీ మరి కొంతమంది తల్లిదండ్రులు మాత్రం విద్యార్థుల చదువు దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఇలా  వ్యవహరిస్తోంది అంటూ తెలియజేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా ఇటీవల పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. వీరికి కూడా రోజు మార్చి రోజు పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇలాంటి పద్ధతి ఏ విధంగా విద్యార్థులకు కలిసొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: