ఏపీ ఫైబర్ నెట్ నుండి 410 ఉద్యోగులు ఔట్.. ?

Veldandi Saikiran

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు.  ఏపీ ఫైబర్ నెట్ 410 మంది ఉద్యోగులను తొలగించారు. వైసిపి ప్రభుత్వ అవినీతి అక్రమాల వల్ల ఏపీ ఫైబర్ నెట్ సంస్థ దివాలా తీసే దశకు చేరిందని ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. లాభాల్లో నడిచే సంస్థను వైసీపీ ప్రభుత్వం నష్టాల పాలు చేసిందని వాపోతున్నారు. ఫలితంగా ఏపీఎస్ఎఫ్ఎల్ కు రూ. 1200 కోట్లు అప్పుల పాలు చేయడంతో పాటు రూ. 900 కోట్లు బకాయిలు పెట్టిందని తెలియజేశాడు.

తాము కక్షతో దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదన్న అర్హత కూడా అక్రమంగా నియమితులైన ఈ ఉద్యోగులను తీయకపోతే సంస్థ రోడ్డున పడుతుందని ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా జీవి రెడ్డి తెలియజేశాడు. తొలగింపుపై ఉద్యోగాలు ఎక్కువగా మాట్లాడిన, గోల చేసిన వేతనాలు రికవరీ సహా కేసులు పెట్టాల్సి వస్తుందని వెల్లడించాడు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎండీ లెక్కలేని తనంగా వ్యవహరించారని ఆగ్రహించారు. అంతేకాదు అడ్డగోలుగా ఉద్యోగులను నియమించిన వారికి లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని హెచ్చరించారు.

తక్కువ ధరకే ఇంటింటికి కేబుల్, ఇంటర్నెట్, ఫోన్స్ సదుపాయాలు అందించేందుకు గతంలో టిడిపి ప్రభుత్వం తెచ్చిన ఫైబర్ నెట్ ను వైఎస్ఆర్సిపి సర్కార్ నిర్వీర్యం చేసిందని అన్నారు.  వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో ప్రచారం చేసినందుకుగాను గత ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మ ఫైబర్ నెట్ నుంచి అక్రమంగా నిధులు చెల్లించారని అన్నారు. ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవికి అక్రమంగా డబ్బు చెల్లించారని అన్నారు.

డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆర్జీవికి 15 రోజుల సమయం ఇచ్చామన్న ఆయన గడువులోగా డబ్బు చెల్లించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశాడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్మెంట్లను పరిశీలిస్తున్నామని వారిని మరికొద్ది రోజుల్లో తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ను సమూలంగా ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తెస్తామని చైర్మన్ జివిరెడ్డి వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: