సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 8 సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందన్నారు.తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం అని తెలిపారు. ఇదిలావుండగా సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనదన్నారు. తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని.. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. బౌన్సర్ల విషయంలో ఇకపై సీరియస్గా ఉంటామన్నారు.ఇదిలావుండగా ప్రముఖుల భేటీలో హీరోలు అల్లు అర్జున్ ప్రస్తావన రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పుష్ప-2 మూవీ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పే సమయంలో సీఎం రేవంత్ పేరు మర్చిపోయారని. అందుకే అరెస్ట్ చేయించారనే ప్రచారం జరిగింది.
అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?అన్నారు సీఎం. అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడంతోనే అరెస్టు చేశారన్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్ పై ఉంది కదా. అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు.హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు నాకు చిన్నప్పటి నుండి తెలుసన్నారు. వారిద్దరూ నాతో కలిసి తిరిగిన వారే అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టం ప్రకారం వ్యవహరించాలి అనేది నా విధానం అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని తెలిపారు.అలాగే సామాజిక అంశాలపై ప్రచార చిత్రాలు చేయాల్సిందే.. మా అసోసియేషన్‌కు కావాలంటే స్థలాలు ఇస్తాం. ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీ కలిసి పనిచేయాలి' అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు.