పాకిస్తాన్ లో పుట్టి.. భారత్ ప్రధాని..మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర..!
డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్ లోని గఫ్ అనే ప్రాంతంలో జన్మించారు.. (ఇప్పుడు ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నదట.) 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా కూడా వ్యవహరించారు. ఇండియన్ ఆర్థిక వ్యవస్థలలో ఆయన తీసుకువచ్చిన ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఆయన ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టేలా చేశాయి.
ఇక మన్మోహన్ సింగ్ గారి విద్యను పంజాబ్ యూనివర్సిటీలో ఆయన ప్రారంభించారట..1952లో BA, 1954లో MA ఆర్థిక శాస్త్రంలో పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ని పొందారు. 1962లో నా ఫీల్డ్ కాలేజ్, ఆక్ఫార్డ్ నుండి డిఫిల్ ని సైతం పూర్తి చేశారట. ఈయన అధ్యాపకుడిగా కూడా బోధించారట.
1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో మన్మోహన్ సింగ్ సలహాదారుడుగా తన రాజకీయాన్ని మొదలుపెట్టారు. అలా నెమ్మదిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా ఎదిగారు.. 1991 నుంచి 96 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను సైతం అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. 2004లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయాన్ని అందుకోగా.. సోనియా గాంధీ మన్మోహన్ సింగను ప్రధానమంత్రిగా నామినేట్ చేశారట. ఈయన ప్రభుత్వ హయాములో సగటు ఆర్థిక అభివృద్ధి 7 .7 కు పైగా సాధించింది పేదరికం తగ్గింపులో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. 2009లో తిరిగి మళ్ళీ ఎన్నికయ్యారు..