తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న ఎంతో మంది మహిళ నేతలు ఉన్నారు. ఇకపోతే కొంత మంది తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారు. అలా తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కడియం కావ్య ఒకరు. కడియం కావ్య దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదువును పూర్తి చేసింది. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి (పాథాలజీ) పూర్తి చేసింది.
ఆ తర్వాత వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా కూడా పని చేసింది. ఇలా వైద్య వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈమె తన తండ్రి కడియం శ్రీహరి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2024 లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఇకపోతే ఆమెను మార్చి 13 న వరంగల్ ఎంపీ అభ్యర్థిగా స్థానం కల్పిస్తున్నట్లు బి ఆర్ ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ ప్రకటించాడు. కానీ ఆమె మార్చి 29 న వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు అలాగే పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కడియం కావ్య 2024 మార్చి 31 న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరింది.
ఆమెను ఏప్రిల్ 1 న వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆమె 2024 లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొదటి సారి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీ జే పీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై భారీ ఓట్ల మెజారిటీ తో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఇలా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కడియం కావ్య మొదటి ప్రయత్నంలోనే రాజకీయాల్లో మంచి విజయాన్ని అందుకుంది.