' ఏలూరి- గొట్టిపాటి ' .. నేర్చుకోండి త‌మ్ముళ్లు.. !

RAMAKRISHNA S.S.
ఎమ్మెల్యేగా అవ‌కాశం రావ‌డం అంటే ఎలా ?  అందులోనూ కీల‌క నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న నాయ‌కులు ఎలా ఉండాలి ?  ప్ర‌జ‌ల మ‌న సు గెలుచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఒక్క‌సారి విజ‌యం ద‌క్కించుకుంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిచేలా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి. ప్ర‌జ‌ల‌కు వాళ్లు త‌ప్పు మ‌రొక‌రు క‌న‌ప‌డ‌కూడ‌దు.. దీనికి ఉదాహ‌ర‌ణ చాలా మంది నాయ‌కులు ఉన్నారు. పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివ‌రావు నుంచి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి వ‌ర‌కు.. అధికార పార్టీలో ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లు. వీరిని చూసి నేర్చుకునేందుకు చాలా ఉంది.

ఒక మాట‌లో చెప్పాలంటే.. ఏలూరి, గొట్టిపాటి.. నేటి త‌రం రాజ‌కీయ నేత‌ల‌కు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్న పొలిటిక‌ల్ లైబ్ర‌రీలు .. ! ఎక్క‌డ ఎలా ఉండాలో.. ఎలా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవ్వాలో.. వారి నుంచి నేర్చుకో వ‌చ్చు. తీవ్ర వ్య‌తిరేక గాలులు వీచినా.. త‌మ స్థానాల‌ను వారు నిల‌బెట్టుకున్నారు. కేవ‌లం ఓటు బ్యాంకు మేనేజ్‌మెంటుతో వారు రాజ‌కీయాల్లో ఎద‌గ‌లేదు. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుని రాజ‌కీయాల్లో సుస్థిర స్థానం పొందారు. అందుకే.. నేటి త‌రం రాజ‌కీయాల్లో వారు ఐకాన్లుగా నిలిచార‌న్న‌ది అప్ర‌క‌టిత ర‌హ‌స్యం.

స‌రే.. ఇప్పుడు ఇవ‌న్నీ.. ఎందుకు ? అనే సందేహం వ‌స్తుంది. సొంత పార్టీలో కుంప‌ట్ల గురించి టీడీపీ అధి నేత చంద్ర‌బాబుకు రోజూ ఏదో ఒక ఫిర్యాదు అందుతూనే ఉంది. ముఖ్యంగా తొలిసారి విజ‌యం ద‌క్కించు కున్న నాయ‌కుల నుంచి మ‌రిన్ని ఎక్కువ‌గా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. ఆధిప త్య పోరులో అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు.. 40కిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సైకిల్ న‌లిగిపో తోంది. ఎవ‌రిది వారే పెత్త‌నం.. అనే టైపులో రాజ‌కీయాలు సాగుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా తాము టికెట్లు త్యాగం చేయ‌డం ద్వారా.. వేరేవారికి అవ‌కాశం క‌ల్పించిన నాయ‌కులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌ను డ‌మ్మీల‌ను చేసిన వైనంపై ఇప్ప‌టికే చాలా ఫిర్యాదులు చంద్రబాబు చెంత‌కు చేరాయి. ఇక కొత్త‌గా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తామేదో సాధించేశాం అన్న‌ట్టుగా ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ముందుకు వెళుతున్నార‌ట‌. దీంతో ఇప్పుడు.. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. బ‌య‌ట‌కు పొక్కితే మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తాయ‌ని భావిస్తున్న చంద్ర‌బాబు అండ్ కోలు.. సీనియ‌ర్ల‌ను చూసి నేర్చుకోవాల‌ని.. వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

పైగా ఇలా దిక్సూచిగా చెపుతోన్న‌ సీనియ‌ర్ల‌లోనూ.. ఏలూరి - గొట్టిపాటి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల‌ కిందట క‌ర్నూలుకు వెళ్లిన గొట్టిపాటి.. అక్క‌డి నాయ‌కుల‌కు ఎలా అంద‌రితోనూ స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు వెళ్లాలో హిత‌వు ప‌లికారు. అంటే.. ఇది చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కే జ‌రిగింద‌ని.. కాబ‌ట్టి.. పార్టీలో అంత‌ర్గ‌తంగా ఏం జ‌రుగుతోంద‌న్న‌ది తెలుస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: