తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చింది.. ఈ మన్మోహనునుడే తెలుసా?
ఆయన రెండుసార్లు పీఎంగా పనిచేశారు, ఆర్థిక మంత్రిగా కూడా పని చేశారు. అయితే వాటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తమకు సొంత రాష్ట్రాన్ని అందించినట్లుగా మన్మోహన్ సింగ్ ని గుర్తు పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి ఎలాంటి హోదా ఇవ్వాలో కూడా ఆయన నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత చెడిపోకుండా ఉండటానికి ఆయన అందించిన ఏపీ పునర్విభజన చట్టం రూపకల్పన, ఏపీకు హామీలు గురించి మనందరికీ తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసలు సహకరించలేదు, తీవ్ర వ్యతిరేకత చూపారు. ఆ సమయంలో కూడా మన్మోహన్ సింగ్ చాలా కామ్ గా శాంతంగా వ్యవహరించారు. ఆయనే ఒక్కడే చాలా ముందుకు నడిపారు. ఆయన వల్లే తెలంగాణ వచ్చిందని నేడు తెలంగాణ ప్రజలందరూ స్మరించుకుంటున్నారు. ఆ గొప్ప మహానేత లాంటివారు మళ్లీ పుట్టి తెలంగాణను బాగు చేయాలని కోరుకుంటున్నారు. ఇకపోతే 92 ఏళ్ల వయసులో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోవడం చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.