వైసీపీ ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని రాజకీయ సన్యాసం వెనక..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ? ఊహించలేరు.. ఒక్కోసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా . . అంచనాలకు అందకుండా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో జరగనుంది. వైసీపీ కేలక నాయుడు నాయకుడు .. మాజీ మంత్రి పైర్ బ్రాండ్ కొడాలి నాని రాజకీయంగా సన్యాసం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు గుడివాడ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే ఆయన ప్రకటన చేయనున్నట్టు గుడివాడ లో చర్చ సాగుతుంది. రాజకీయంగా కొడాలి నాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కొడాలి నాని కి అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం నాని అనారోగ్యంతో ఉన్నారని .. ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారన్నది గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ.
ఈరోజు కాకపోతే రేపు అయినా ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లు .. అటు అనారోగ్యం ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆయన ఇక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ యేడాది జరిగిన ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు .. వచ్చే ఎన్నికల నాటికి తన పోటీచేది లేదని కూడా నాని ప్రచారంలో చెప్పారు. అయితే రాజకీయంగా ఆయన సెంటిమెంట్ కోసం ఇలాంటి ప్రచారం చేసుకున్నారని అనుకున్న తాజా ఎన్నికల్లో ఏకంగా 53,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు.
ఆ తర్వాత ఆయన ఎక్కడ యాక్టివ్ గా కనిపించడం లేదు .. పైగా కూటమి సర్కారు కేసులు పెడుతుంది అన్న భయం కూడా ఆయనలో ఉందని అంటున్నారు. ఇటు అనారోగ్య సమస్యలు .. ఇతర సమస్యలు ఇవన్నీ చుట్టుముట్టిన నేపథ్యంలో నాని ఇక రాజకీయాల్లో కొనసాగే ఆలోచనలో లేరని అంటున్నారు.