![ఏపీ: డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ సమాధానం ఇదే..!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/politics/politics_latestnews/naralokesh-tdp-ap-dupyut-cm-post-comments-viral743584ff-ccbb-49a7-b39d-83dd3589db1e-415x250.jpg)
ఏపీ: డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ సమాధానం ఇదే..!
ఈ విషయం పైన అటు టిడిపి ,జనసేన నేతల మధ్య మాటలు ఉద్యమం కూడా పెరగడం జరిగింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా తనకు ఎలాంటి అధికారాలు వద్దని పదవుల కోసం తాను ఆశించి రాజకీయాల్లోకి రాలేదని తెలియజేశారు. ఇటీవలే నారా లోకేష్ విశాఖలో పర్యటించగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పదవి పైన కామెంట్స్ చేయడం జరిగింది.. తనకు సీఎం పదవి అవసరం లేదని టిడిపి కార్యకర్తగా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తే చాలని తెలియజేశారు.
పార్టీ బలోపేతం కోసమే తాను కృషి చేశానని పార్టీకి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకువచ్చేలా పనిచేయని తెలిపారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లు మాత్రమే కొనసాగాలి అంటూ తెలియజేశారు నారా లోకేష్. అందుకే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను మరొకరికి అప్పగించేలా ఆలోచనలో ఉన్నానంటూ వెల్లడించారు. తాజాగా డిప్యూటీ సీఎం పదవి కూటమిలో అలజడి రేపిన విషయంపై ఇలా ఇండైరెక్టుగా క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు అంతర్గతంగా వైరల్ గా మారుతూ ఉన్నాయి.