తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు ఏడాది కాలం పూర్తి అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో
తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్లిన...
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టడం తప్ప ఎక్కడ పాజిటివ్‌గా మాట్లాడే సిచువేషన్ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీ లా అంటూ... గారడి చేసిందట
కాంగ్రెస్ పార్టీ... ఈ విషయాన్ని
తెలంగాణ ప్రజలే గొంతు విప్పి చెబుతున్నారు.
కానీ
ముఖ్యమంత్రి పీఠం వరించిన తర్వాత....
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం లేదని గులాబీ
పార్టీ కూడా విమర్శలు చేస్తోంది. ఫ్రీ బస్సు మినహా... ఏ పథకం సరిగ్గా అమలు పరచడం లేదని
తెలంగాణ ప్రజలే అంటున్నారు. అయితే మొన్న
జనవరి 26వ తేదీన నాలుగు పథకాలు అమలు చేస్తామని
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై కాస్త పాజిటివ్.. రియాక్షన్స్ వచ్చాయి.
యంగ్ అండ్ డైనమిక్ సీఎం
రేవంత్ రెడ్డి కాబట్టి అతడు కచ్చితంగా అమలు చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 26వ తేదీ అయిపోయిన రెండు రోజులైన అప్పటికి కూడా... రైతుబంధు చాలామంది రైతుల అకౌంట్లో పడలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో సోషల్
మీడియా వేదికగా.. అధికారిక
కాంగ్రెస్ ఒక పోస్ట్ పెట్టింది. కెసిఆర్ పాలన బాగుందా? లేదా
కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా? అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది కాంగ్రెస్.
అయితే ఈ పోస్టు ట్విట్టర్లో పెట్టడంతో చాలామంది ఓట్లు వేశారు. దాదాపు లక్ష మంది ఇందులో పాల్గొన్నారు. ఇందులో 67కు పైగా ఓట్లు కేసిఆర్ కు వచ్చాయి. మిగిలిన ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి
తెలంగాణ ముఖ్యమంత్రిగా
కేసీఆర్ అవుతారని... ఈ
సర్వే పోల్ చెప్పింది. దీంతో
కాంగ్రెస్ పెట్టిన సోషల్
మీడియా పోస్టును గులాబీ పార్టీలు తెగ వాడుకుంటున్నారు. మరోసారి
ముఖ్యమంత్రి కేసీఆర్ అని... గ్రామస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. దీంతో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా..
కాంగ్రెస్ పార్టీ పరువు పోయిందని గులాబీ
పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.