Union budget-2025: బడ్జెట్ తయారీలో కీలకమైన వారు వీరే..!

frame Union budget-2025: బడ్జెట్ తయారీలో కీలకమైన వారు వీరే..!

Divya
ప్రతి ఏడాది కూడా కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఈసారి 2025 కు సంబంధించి ఫిబ్రవరి ఒకటవ తేదీన వరుసగా 8వ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక బడ్జెట్ రూపొందించడంలో ఆర్థిక మంత్రితో పాటు చాలా కీలకమైన అధికారులు కూడా పనిచేస్తూ ఉంటారట. అయితే వీరి పాత్ర కూడా బడ్జెట్ తయారీలలో చాలా కీలకంగా ఉంటుందట. మరి ఎవరు ఏ రంగానికి ఎంత బడ్జెట్ అమలు చేస్తారు లోటు పాట్లు ఎలా ఉంటాయి.. తదితర అంశాల పైన ఎవరు కీలక పాత్ర పోషిస్తారు ఆ అధికారులు ఎవరు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

తుహిన్ కాంత పాండే: ఆర్థిక రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారట.. ఈయన 1987 ఒడిస్సా కేడర్ ఐఏఎస్ అధికారిగా ఉండేవారట. ఈయనను ఆదాయ పన్ను చట్టం కింద ఏదైనా మార్పు ఉంటే తెలిసేలా చేయవచ్చట. ముఖ్యంగా పన్నులు తగ్గించాలన్న అంచనాలను నెరవేర్చేటువంటి ఒక టాస్క్ ను ఈయనకు అప్పగించారు.

వి అనంత నాగేశ్వరన్:
ఎకనామిక్ చీఫ్ అడ్వైజర్.. ఐఐటీలో చదివి అమెరికాలో ఈయన డాక్టరేట్ పొందారట. ఈయన ఆధ్వర్యంలోనే ఆర్థిక సర్వే నిర్వహించి ఒక నివేదికను కూడా ఇస్తారట.

అజయ్ సేథ్:
సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ వంటివి చూస్తారు.. 1987 బ్యాచ్ లో ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలోనే తుది బడ్జెట్ పత్రాలు కూడా సిద్ధమవుతాయట. ముఖ్యంగా ఖర్చులను నియంత్రించేదాలతో పాటు అవసరమైన ఖర్చులకు అనుమతించే వాటిలో కీలక బాధ్యత వ్యవహరిస్తారట.
మనోజ్ గోవిల్:
ఈయన మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి.. గతంలో ఈయన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారట. బడ్జెట్లలో సబ్సిడీలు, కేంద్ర ప్రామోజిత పథకాలు ఖర్చులకు సైతం అయ్యేటువంటి వాటిలో ఈయన పర్యవేక్షణలోనే ఉంటాయట.

అరుణిష్ చావ్లా:
Dipam,dpe ఈయన ప్రభుత్వ సంస్థల నుండి పెట్టుబడులు ఉపసంహరించడానికి అలాగే ప్రభుత్వ ఆస్తులను సైతం మోనోటైజేషన్ చేయడానికి వంటి వాటిని సూచిస్తారట.
ఎం నాగరాజు:
సెక్రటరీ ఫైనాన్షియల్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారట. ప్రభుత్వ ఖజానాకు తగినంత రుణాలు డిపాజిట్లు వచ్చేలా చేస్తూ ఉంటారట. అలాగే బీమా కవరేజ్ ను పెంచడం డిజిటల్ ఇంటర్ ఫేస్లను బలోపేతం చేయడానికి ఉన్నారట. వీరంతా కూడా కేంద్ర బడ్జెట్ తయారీలో కీలకమైన వారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: