Union budget -2025:చిన్న ,మధ్య తరహా పరిశ్రమలకు భారీ ఊరట.. రూ.10 కోట్ల వరకు పెంపు..!

frame Union budget -2025:చిన్న ,మధ్య తరహా పరిశ్రమలకు భారీ ఊరట.. రూ.10 కోట్ల వరకు పెంపు..!

Divya
ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్ ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 రానే వచ్చింది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అటు పార్లమెంట్లో 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజు పార్లమెంటులో సమర్పించడం జరిగింది. ముఖ్యంగా బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయని అందరూ ఎదురు చూస్తూ ఉండగా.. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
దాదాపు పది బడ్జెట్లు సమర్పించిన మొరాజీ దేశాయ్ రికార్డుకు చేరువయ్యింది నిర్మల సీతారామన్.ఇక ఆ బడ్జెట్ లో భాగంగానే చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు భారీ ఊరట కలిగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మధ్యతరగతి కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించి ఆదాయం పొందాలని చూస్తున్నారో అలాంటి వారికి భారీ ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు 5 కోట్ల రూపాయలు మాత్రమే రుణం లభించేది. అయితే దీనికి మరో 5 కోట్ల రూపాయల రుణాన్ని జమ చేస్తూ.. మొత్తం  10 కోట్ల రూపాయలకు పెంచింది. ముఖ్యంగా స్టార్టప్స్ విషయంలో సంచలన ప్రకటన చేసిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా రూ.10 కోట్ల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని సమాచారం. దీనికి తోడు బొమ్మల తయారీ కొరకు ప్రత్యేక స్కీమును అమలు చేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపింది.
ప్రస్తుతం ఈ విషయం అటు చిన్న తరహా ఇటు మధ్యతరహా పరిశ్రమలు స్థాపించే వారికి భారీ  ఊరట కలిగిందని చెప్పవచ్చు . ముఖ్యంగా బయట ఎక్కువ వడ్డీతో డబ్బు తెచ్చుకుని ఇబ్బందులు పడే కన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణంతో స్టార్ట్ అప్ కంపెనీలు ప్రారంభించడం వల్ల నష్టాన్ని కొంతవరకు పూడ్చుకోవచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: