కొత్త రేషన్ కార్డులపై చంద్రబాబు సర్కార్‌ శుభవార్త!

Veldandi Saikiran

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్.  త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.   క్యూఆర్ కోడ్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నామని... అప్పుడే  కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.  ఇవాళ అసెంబ్లీలో అక్రమంగా తరలిపోతున్న రేషన్‌ బియ్యంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈకేవైసీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఏఐ కెమెరాల ద్వారా రేషన్ గోదాముల్లో స్టాక్ పై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.


సివిల్ సప్లయ్స్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. రేషన్ మాఫియాపై ఉక్కుపాదమని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్. PDS బియ్యం అంటే కేవలం స్మగ్లింగ్ అనే విధంగా గత పాలకులు మార్చేశారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 60 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామని తెలిపారు నాదెండ్ల మనోహర్.



పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, అరికట్టే చర్యలపై సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడారు.  రేషన్ బియ్యం కేజీకి 46 .10 రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.  32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పీడీఎస్ రైస్ కోసం వినియోగిస్తున్నామన్నారు.  గత ప్రభుత్వం వ్యవస్థీకృతం గా pds రైస్ అంటే స్మగ్లింగ్ రైస్ గా మార్చేసారని ఆరోపణలు చేశారు.  అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీ డీ యాక్ట్ లలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామని ప్రకటించారు.


కాకినాడ పోర్ట్ లో 50 వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేసి 25 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ గా గుర్తించామని వివరించారు. త్వరలో QR కోడ్ తో రేషన్ కార్డు లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు.  Ekyc, AI కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు నాదెండ్ల మనోహర్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: