ఏపీ: డిప్యూటీ సీఎంపై.. ఫైర్ అయిన యాంకర్ శ్యామల.. ఈసారి ఏకంగా..?

Divya
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏవేవో మాటలు చెప్పి ఎన్నికలలో గెలిచిన తర్వాత వాటిని అసలు పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ ను కూడా నిలదీస్తూ ఉన్నారు. చాలామంది నేతలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలకు ఇప్పుడు చేస్తున్న వాటికి పొంతన లేదంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామల మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా అనే విధంగా మాట్లాడింది.. ఈమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పైన పలు రకాల వ్యాఖ్యలు చేసింది శ్యామల. ఈ మాటలు  ఏపీ అంతట వైరల్ గా మారుతున్నాయి.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చిన ఘనత జగన్ కి దక్కిందని.. దిశా యాప్ ను  ప్రవేశపెట్టి మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించారు. అపద్ధపు హామీలను చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాటి గురించి ఎత్తలేదని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించి మళ్లీ ఊగుతూ మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసింది..


అంతేకాకుండా ఆడపిల్లల రక్షణ తన బాధ్యత అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ బాధ్యత ఏమయ్యింది అంటూ మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంది అంటూ ప్రశ్నించింది. వైసిపి హయాంలో నవరత్నాల పేరుతో పూర్తిగా పథకాలను అమలు చేశారని తెలిపింది. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఆ తర్వాత హామీలని మరిచిపోయారంటూ ఫైర్ అయ్యింది యాంకర్ శ్యామల. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి.. ఇప్పుడు జిల్లాలకే పరిమితం అంటూ ప్రకటించారు.. అధికారంలోకి వచ్చిన తరువాత సుగాలి ప్రీతి కేసుని చేదిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ కేసు గురించి పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు కానీ మాట్లాడలేదు. వీరికి క్రెడిబిలిటీ లేదా అంటూ ఫైర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: