ఏపీ: ఉచిత బస్సు కూటమికి మైనస్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు తిరుగుతుందంటూ ఇటీవలే అసెంబ్లీ సమావేశాలలో తెలియజేశారు. అయితే ఈ విషయం పైన మహిళలు ఆనందపడతారని కూటమి ప్రభుత్వం తెగ సంబరపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎక్కడ చూసినా కూడా బస్ చార్జీలు బాదేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ వంటి ప్రాంతాలలో ఉచిత బస్సు పథకాలు మహిళలకు బాగానే ఉపయోగపడుతున్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉచిత బస్సు విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్రమంతటా కూడా ఏ మూల నుంచి అయినా ఏ మూల వరకు వెళ్లిన ఫ్రీగానే మహిళలు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు.


దీంతో ఆర్టీసీకి నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది వచ్చిన ధైర్యంగానే ముందుకు వెళుతున్నాయి కర్ణాటక తెలంగాణ ప్రాంతాలు. అయితే ఏపీలో మాత్రం హామీ అలాగే ఉండిపోయినప్పటికీ తాజాగా బడ్జెట్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఉచిత బస్సు ప్రస్తావన అట్టకెక్కిందనే విధంగా విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా వేలెత్తి చూపడంతో శాసనసభలలో కూడా ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎప్పుడు అంటూ ప్రశ్నించడం జరిగింది. ఈ విషయం పైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానాన్ని తెలుపుతూ ఉచిత బస్సు రాష్ట్ర మంత తిరగదు అంటూ తెలియజేశారు.


కేవలం జిల్లాలలో మాత్రమే ఇది వర్తిస్తుందని తెలియజేశారు. దీంతో మహిళలకు ఉచిత బస్సు హామీ అనే పథకం నీరుకారిపోయేలా చేసింది. జిల్లాలు దాటితే  ఉచిత బస్సు ప్రయాణం చెల్లదు అంటూ దూర ప్రయాణాలకు పనికిరాదు అలాంటప్పుడు ఈ పథకాన్ని ఎందుకు చెప్పాలి అంటూ కూడా మహిళలు నిలదీస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఉచిత బస్సు హామీ మైలేజిస్తుందనుకుంటే మైనస్ గా మారిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికంటే ఈ పథకం అమలు చేయకపోవడమే మేలు అన్నట్లుగా మరి కొంతమంది కూటమినేతలు, కార్యకర్తలు తెలియజేస్తున్నారట. ఈ విషయం పైన కూటమి నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: