
ఏపీ: రాజకీయాలకు టిడిపి సీనియర్ లీడర్ గుడ్ బై చెప్పినట్టేనా..?
టిడిపి సీనియర్ నేతగా రాజకీయంగా ఒక సంచలనంగా మారిన యనమల ప్రస్తుతం శాసన మండలి సభ్యుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరో కొద్ది రోజులలో పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఈయన రాబోయే భవిష్యత్తు ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఈ నేత ఎన్నో పదవులను కూడా అందుకున్నారు ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది.. శాసనసభ స్పీకర్గా అటు ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లో పనిచేయడం జరిగింది.
సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నేతలు ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాకపోవడంతో ఈయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి ఈయన కుమార్తె ఎమ్మెల్యేగా , అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారట.1982లో రాజకీయాలతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అన్ని కూడా డబ్బున్న వారి రాజకీయాలను మార్చేస్తూ ఉన్నారని సీఎం చంద్రబాబు ఫోన్ చేయడంతో యనమల ఎన్నో విషయాలను వివరించారట.. ఇప్పటివరకు తనకు అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని సీఎం చంద్రబాబు కు తెలిపారుట..ఒకవేళ తనకి అవకాశం వస్తే రాజ్యసభకు వెళ్తానని లేకపోతే రాజకీయ జీవితాన్ని ఇంతటితో ముగింపు పలికి విశ్రాంతి తీసుకుంటాననే విధంగా క్లారిటీ ఇచ్చారట. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకొని యనమలకు అవకాశం కల్పిస్తారా లేకపోతే సీనియర్లు అందరినీ కూడా పక్కకి పెట్టేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.