కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో పవన్.. ఆయనే కాపాడారంటూ.?

Pandrala Sravanthi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని చిత్రాడ లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద పండుగ లాగా నిర్వహించారు జనసేన నాయకులు. అయితే ఈ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు టిడిపి కి కూడా పరోక్ష కామెంట్లు చేయడంతో పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరిపై కూడా టిడిపిలోని ఒక వర్గం ప్రజలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కావాలనే ఆ మాటలు అన్నారో లేక పొరపాటున అన్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్, నాగబాబు వ్యాఖ్యలు మాత్రం టిడిపి శ్రేణులకి మంట పుట్టిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. 

ఇందులో భాగంగా కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉన్న నన్ను ఆయనే కాపాడారు అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ని కాపాడింది ఎవరయ్యా అంటే వ్యక్తి కాదు దేవుడు...ఆయనే కొండగట్టు ఆంజనేయ స్వామి .. పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి భక్తుడనే సంగతి మనకు తెలిసిందే.ఆయన కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉన్న సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి నన్ను బతికించాడు అంటూ ఆ సభలో తెలంగాణ గురించి గొప్పగా చెబుతూ అలాగే కొండగట్టు ఆంజనేయస్వామి దేవుడి లీలల గురించి చెప్పుకొచ్చారు.

నా తెలంగాణ కోటి రతణాల వీణ.. తెలంగాణ నా జనసేనకు జన్మస్థ్ అయితే ఆంధ్రప్రదేశ్ నా కర్మస్థలం అంటూ తెలంగాణను పొగుడుతూ గొప్పగా మాట్లాడారు. ఆ కొండగట్టు అంజన్న కరెంటు షాక్ తో చనిపోయే స్టేజ్ లో ఉన్న నాకు ఊపిరి పోసాడు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తెలంగాణ వాసుల్ని ఆకట్టుకున్నాయి.ఇక కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దేశం మొత్తం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: