
తల్లికి వందనం: మార్గదర్శకాలివే.. కారు,300 యూనిట్స్ దాటిన ఇస్తారా..?
ఇటీవలే అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ పథకం గురించి కూడా మాట్లాడడం జరిగింది.9407 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారట. 2024-2025 సంవత్సరంలో సుమారుగా 81 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారట. అయితే ఇందులో ప్రాథమికంగా 70 లక్షల మందికి ఈ పథకానికి అర్హులు ఉన్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. అలాగే విద్యార్థులు 75% వరకు హాజరునిబంధన కూడా ఉంటుందట. ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్ని విధి విధానాల పైన చర్చలు జరుపుతున్నారట.
గతంలో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా సమీక్షిస్తున్నారని.. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్లు విద్యుత్ వినియోగించిన, కారు కలిగి ఉన్న, 1000 చెదరపు అడుగుల ఇంటిని కలిగి ఉన్న ఈ పథకానికి అనర్హులు.. అయితే ఇందులో గతంలో టీడీపీ నేతలు సైతం విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో కూటమి నేతలు వ్యతిరేకించినప్పటికీ మరి ఈసారి కారు ఉన్నవారికి, 300 యూనిట్లు దాటిన వారికి ఇస్తారా లేరా అన్నది చూడాలి మరి. మరి మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం పైన ప్రజలు విసిగిపోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు తీసుకుని నిర్ణయాలతో ప్రజల మనసు మారుస్తారేమో చూడాలి.