7 % ఓటుతో 100 స్ట్రైక్ రేటు ఎలా వ‌స్తుంది ప‌వ‌న్‌...?

frame 7 % ఓటుతో 100 స్ట్రైక్ రేటు ఎలా వ‌స్తుంది ప‌వ‌న్‌...?

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజాగా పిఠాపురం జ‌న‌సేన జై భేరీ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలుగుదేశం వ‌ర్గాల్లో మంట పుట్టించేస్తున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే తాను 100 % స్ట్రైక్ రేటు అంటూ ప‌వ‌న్ .. జ‌న‌సేన అభిమానులు చేస్తోన్న వ్యాఖ్య‌లు కూడా ఇప్పుడు కూట‌మి లో కుంప‌ట్లు రాజేస్తున్నాయి. ఇక పోటీ చేసిన ప్రతి చోటా గెలవాలంటే ఆ రాజకీయ పార్టీ కి ఎంత బలం ఉండాలి ? ఇక‌ కేవలం ఏడు అంటే ఏడు శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేన 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది ... ఇదంతా మా బ‌ల‌మే అని వైసీపీ వాళ్లు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. దీనినే గ‌ట్టిగా ప్ర‌చారం చేసుకుంటున్నారు.

అయితే ఇదంతా జ‌న‌సేన బ‌ల‌మా ? అంటే అలా అని ఆ పార్టీ వాళ్లు .. ప‌వ‌న్ .. నాగ‌బాబు చెపితే ఎవ‌రైనా న‌మ్ముతారా ?  కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారిక లెక్క‌లు చూసుకున్నా 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు ఏడు శాతం లోపు మాత్ర‌మే.. ! పోనీ జనసేన 2024 ఎన్నికల వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసింది కాబట్టి ఆ పార్టీ ఓటు బ్యాంకు పది శాతం వరకు పెరిగింది అనుకున్నా కూడా .. ప‌ది శాతం ఓట్ల తో ఎక్క‌డా కూడా 100 శాతం స్ట్రైక్ రేటు సాధ్యం కాదు క‌దా ?  ఖ‌చ్చితంగా కాదు.

కానీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి జనసేన నేతలు పదే పదే వంద శాతం స్ట్రైక్ రేట్ అంటూ .. ఆ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకుంటున్నారు. జ‌న‌సేన సైనికులు ఇలా చెప్పుకోవ‌డం ఇప్పుడు టీడీపీ వాళ్ల‌ను బాగా గుచ్చుతోంది. నలభై ఏళ్ల పార్టీ ని కూడా నిలబెట్టాను అని వ్యాఖ్యానించటం టీడీపీ నేతలు, క్యాడర్ లో పెద్ద దుమారం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: