సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎప్పటికప్పుడు సంచలన కామెంట్లు చేస్తూనే ఉంటాడు. అయితే తాజాగా కేటీఆర్ రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎఫైర్స్ అన్ని మాకు తెలుసు.సీఎం బాగోతలాన్ని బయటపెడతామంటూ కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో పాల్గొని మాట్లాడడం ప్రస్తుతం మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. మరి ఇంతకీ మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్. ఆయనకి ఇప్పుడు కుటుంబం గుర్తుకు వచ్చిందా.. అడ్డమైన వాళ్లతో మాకు ఎన్నో ఎఫైర్లు అంటగట్టాడు. అప్పుడు ఫ్యామిలీ గుర్తుకు రాలేదా..
పాలన మర్చిపోయి ఢిల్లీకి లోని కేసి వేణుగోపాల్ కి రాహుల్ గాంధీకి డబ్బులు పంపే పనిలో రేవంత్ ఉన్నారు. మా పరువు తీశారు. అప్పుడు మాకు పరువు లేదు కానీ ఇప్పుడు మీకు పరువు గుర్తుకు వచ్చిందా.. మీ ఎఫైర్స్ అన్ని బయట పెట్టాలా.. మీరు ఎన్ని గోడలు దుకారో మాకు తెల్వదా.. ఫార్ములా ఈ వ్యవహారాన్ని మీరు అంత తేలిగ్గా వదిలినా కూడా నేను మాత్రం వదలను. మా గవర్నమెంట్ వచ్చాక అందరి లెక్కలు తీస్తాను. బిజెపి కాంగ్రెస్ రహస్య మీటింగ్ లపై రాజాసింగ్ మాట్లాడితే ఎవరు కూడా అడ్డు చెప్పడం లేదు. ఆయన్ని సస్పెండ్ చేసే దమ్ము బిజెపికి ఉందా..
రేవంత్ ఉదయం 5 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ మై హోమ్ బూజాకు వెళ్తారు. అంత ఉదయాన్నే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది. సాగర్ సొసైటీలో ఎంత టైం గడిపారో చెప్పనా.. 10 సంవత్సరాలు మేం అధికారంలో ఉన్నాం. ఎవరు ఎలాంటి బాగోతాలు చేసారో అన్ని మాకు తెలుసు. కాంగ్రెస్ నేతలే కాదు బిజెపి నేతల బాగోతాలు కూడా మా వద్ద ఉన్నాయి.. అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి.