ఏపీ: ఆరోజే లోకేష్ కు కీలకమైన బాధ్యతలు..!

frame ఏపీ: ఆరోజే లోకేష్ కు కీలకమైన బాధ్యతలు..!

Divya
టిడిపి పార్టీకి ఎప్పుడూ కూడా మహానాడు సభను చాలా ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు.. కార్యకర్త నుంచి అధినేత వరకు మహానాడుని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ మహానాడు సభను నిర్వహించే టిడిపి గత కొన్నేళ్లుగా చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ సభను కొనసాగించాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గ్యాప్ లేకుండా ఈ మహానాడు ను నిర్వహించేవారు. ఇక్కడ పార్టీ విధివిధానాల పైన అలాగే ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ వేదిక పై నిర్ణయించే వారట.

కార్యకర్తల సమక్షంలో మహానాడులో పలు నిర్ణయాలు పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. అందుకే టిడిపి మహానాడు ను ఈ ఏడాది మే నెలలో  జరిపే అవకాశం ఉంటుందట.ఇందులో  ఒక కీలకమైన నిర్ణయం రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ కు పార్టీలో అత్యున్నత బాధ్యతలను కూడా అప్పగించేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది.ప్రస్తుతం ఏపీలో మంత్రిగా కీలకమైన బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.

టిడిపిలో ఎప్పటి నుంచే చంద్రబాబు తర్వాత బాధ్యతలను లోకేష్ కి అప్పగించాలని ప్రతిపాదన కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే గత ఎన్నికలలో మార్పులు చేస్తే ఇబ్బందని ఆలోచించిన టిడిపి నేతలు వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ చాలా కీలకంగా ఉండడంతో ఆయనకు అదనపు బాధ్యతలను చేపట్టించేలా చాలామంది నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారట.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలన పైన దృష్టి పెట్టడంతో పార్టీ వ్యవహారాలను చూడడం ఇబ్బందిగా ఉన్నదని అందుకే నారా లోకేష్ కు పార్టీలో పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించేలా చూస్తున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని అందుకున్నది. పార్టీ పరంగా రాయలసీమలో కూడా టిడిపి పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. మరి టిడిపి మహానాడు సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: