
రేవంత్ రెడ్డి: ఆంధ్ర పేర్లు మార్చుతున్నాడు ?
గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన పనులను ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. గతంలో ఓట్లు రాలాలంటే ఆంధ్రావాళ్లను గట్టిగానే తిట్టేవారు కేసీఆర్. ఆంధ్ర ప్రాంతా రాజకీయ నాయకులను బండ బూతులు తిట్టి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే రూటు ఫాలో అవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఆంధ్ర నాయకులను తిట్టకుండా.. ఆంధ్ర వాళ్ళ పేర్లను మార్చుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇప్పటికే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చి తన మార్పు చూపించారు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతానని ప్రకటించారు. అటు... పీవీ నరసింహారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి పేర్లను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వాడుకుంటుంది. వైయస్సార్ పేరు పైన ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి... పీవీ నరసింహారావు... పేరు పెట్టారు. ఇది గులాబీ పార్టీ హయాంలోనే జరిగింది.
అలాగే ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు నామకరం చేశారు. వెంకటేశ్వర యూటర్నిటీకి...పీవీ పేరు పెట్టడం జరిగింది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సూరవరం ప్రతాపరెడ్డి పేరు... రేవంత్ రెడ్డి.. తన మార్కు చూపించారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తాజాగా అసెంబ్లీలో ప్రకటించారు రేవంత్ రెడ్డి. తమకు తెలంగాణ వాదమే ముఖ్యం అనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఆయన తెలంగాణ ప్రజలకు దగ్గరకు వెళ్లొచ్చని చూస్తున్నారు రేవంత్ రెడ్డి.