
ఏపీ: ఆ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్న వంగవీటి రాధా..!
వంగవీటి రంగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా తన హోదాతో పోరాటాన్ని పీక్స్ కి తీసుకువెళ్లారని ఇప్పటికి చాలామంది చెబుతూ ఉంటారు. రంగా చుట్టూ ఉన్న బలమైన సామాజిక వర్గం ఆయన అంశాలే ఈ నేతకు భారీ క్రేజీ వచ్చేలా చేశాయట. కాంగ్రెస్లో కేవలం మూడున్నరలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న ఎన్నో ప్రకంపనలు సృష్టించారట. ఇప్పటికీ వంగవీటి రంగా పేరు చెప్పుకొని చాలామంది నేతలు ఎదిగిన తీరు కూడా ఉన్నదట. ఇక రంగా కుమారుడు వంగవీటి రాధాకు మాత్రం తండ్రి రాజకీయంగా పేరు దక్కలేదు.
తండ్రి మాదిరి పేదల కోసం ఎన్నో రకాలుగా తపిస్తూ ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం అనుకున్నంత స్థాయిలో ఎదగలేక పోతున్నారని కాపులు వాపోతూ ఉంటారు. 2004లో మొదటిసారి రాధా కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. 2009లో ఒకవేళ కాంగ్రెస్ లో ఉండి ఉంటే కచ్చితంగా మంత్రి అయ్యే వారిని అక్కడి నేతల అభిప్రాయం కానీ ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఓడిపోయారు.. మళ్లీ 2014లో వైసీపీ పార్టీలో చేరి ఓడిపోవడం జరిగింది.. ఇక 2019లో విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వకపోవడంతో వైసిపి పార్టీ నుంచి వీరి టిడిపిలోకి చేరారు. అయితే అప్పుడు టిడిపి పార్టీ ఓడిపోయింది.
ఇక 2024లో రాధ పోటీ చేసేందుకు ప్రయత్నించిన ఆయన అడిగిన విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వకపోవడంతో వదిలేశారు. చివరికి అక్కడ బోండా ఉమాకు టికెట్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కూటమిలో భాగంగా చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఈయన పేరుని పరిశీలించలేదు. దీంతో అభిమానులు హర్ట్ అవ్వడమే కాదు రంగాని పార్టీ పెట్టాలని కూటమిలోనే కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారట. దీంతో ఇతర పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు కూడా తనకు సపోర్ట్ చేస్తారని తెలియజేస్తున్నారట. కాపులకు గుర్తుగా వచ్చేలా పార్టీ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.